బ్రిటన్ ప్రధాని లిజ్‌ ట్రస్‌ రాజీనామా

Telugu Lo Computer
0


బ్రిటన్ ప్రధాని లిజ్‌ ట్రస్‌ రాజీనామా చేశారు. ఆర్థిక, రాజకీయ సంక్షోభంతో సతమతమవుతున్న బ్రిటన్‌లో పరిస్థితులు తారాస్థాయికి చేరిన నేపథ్యంలో ఆమె రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన 45 రోజుల్లోనే ఆమె తన పదవికి రాజీనామా చేయడం కలకలం రేపింది. ప్రభుత్వ పనితీరు పట్ల సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు రావడం, ఆర్ధిక వ్యవస్థ గాడి తప్పడంతో లిజ్ ట్రస్ పదవి నుంచి తప్పుకున్నారు. తద్వారా బ్రిటన్ చరిత్రలో అత్యంత తక్కువ కాలం ప్రధానిగా వ్యవహరించిన వ్యక్తిగా లిజ్ ట్రస్ రికార్డుల్లోకెక్కారు. మినీ బడ్జెట్‌తో పాటు ఆర్థిక సంక్షోభం కారణంగా ఇప్పటికే పలువురు మంత్రులు రాజీనామా చేసిన నేపథ్యంలో ప్రధాని కూడా తప్పుకోవడం కలకలం రేపింది. యూకే ప్రధాని పదవికి బోరిస్‌ జాన్సన్ రాజీనామా తర్వాత కన్జర్వేటివ్‌ పార్టీ ఎన్నికల్లో రిషి సునాక్‌పై విజయం సాధించిన లిజ్‌ట్రస్‌ సెప్టెంబర్‌ 5న ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు లిజ్‌ ట్రస్‌. ప్రధానమంత్రి హోదాలో ఎంపీల ప్రశ్నలకు జవాబివ్వడానికి ట్రస్‌ బుధవారం పార్లమెంటుకు వచ్చిన సందర్భంలో కొందరు ఎంపీలు ఆమె రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు.ఇటీవల లిజ్‌ట్రస్‌ ప్రకటించిన మినీ బడ్జెట్‌ ఆ దేశంలో మాంద్యాన్ని చక్కదిద్దకపోగా బ్రిటన్‌ ఆర్థిక వ్యవస్థ మరింత గందరగోళానికి గురైంది. ఈ క్రమంలోనే ఇద్దరు మంత్రులు రాజీనామా చేయడం, లిజ్‌పై ఒత్తిడికి కారణమైంది. ఈ పరిస్థితుల్లో మరోసారి రాజకీయ సంక్షోభం నెలకొన్న వేళ ఆమె తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తన రాజీనామా విషయాన్ని బ్రిటన్‌ రాజుకు తెలియపరిచానని.. తదుపరి ప్రధానిని ఎన్నుకొనేవరకు పదవిలో కొనసాగనున్నట్టు తెలిపారు. మినీ బడ్జెట్‌తో తీవ్ర విమర్శలపాలైన ట్రస్‌.. తన వాగ్దానం నిలబెట్టుకోలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే లిజ్‌ ట్రస్‌ను పదవి నుంచి తొలగిస్తే ఆమె స్థానంలో రిషి సునాక్‌ను తెరపైకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదే జరిగితే.. 2016లో ఈయూ నుంచి బ్రిటన్‌ వైదొలిగిన తర్వాత..ప్రధాని అర్థాంతరంగా పదవి నుంచి దిగిపోవడం ఇది మూడోసారి అవుతుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)