గోరువెచ్చని నీరు - ప్రయోజనాలు !

Telugu Lo Computer
0


బరువు తగ్గించుకోవడానికి చాలా మంది కఠిన నియమాలు పాటిస్తుంటారు. జిమ్ లో చెమటలు కక్కడం, కడుపు మాడ్చుకోవడం వంటివి చేస్తుంటారు. కరోనా సమయంలో వేడి నీళ్లు తాగడం క్రమంగా అలవాటైంది. అయితే వేడి నీళ్లను తాగడం వల్ల నిజంగా బరువు పెరుగుతారా అనే సందేహం పలువురిలో నెలకొంది. సృష్టిలోని ప్రతి జీవి మనుగడకు నీరు అత్యంతావశ్యకం. శరీరానికి తగినంత నీరు అందించకపోతే జీవక్రియలు సరిగ్గా జరగవు. మనిషి శరీరంలో దాదాపు 70 శాతం నీరే ఉంటుంది. కాబట్టి రోజుకు రెండు నుంచి మూడు లీటర్ల నీరు తాగాలని వైద్యులు, నిపుణులు సూచిస్తుంటారు. అయితే వేడి నీటిని తాగడం వల్ల బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. రోజూ ఉదయాన్నే నిద్ర లేవగానే ఓ గ్లాస్ వేడి నీటిని తాగితే మంచి ఫలితాలు కలుగుతాయి. గోరువెచ్చని నీరు పొట్టలోని వ్యర్థాలను బయటికి పంపిస్తుంది. జీర్ణక్రియ సాఫీగా జరగడానికి సహాయపడుతుంది. కొవ్వును కరిగించి, బరువు తగ్గేందుకు వేడి నీళ్లు సహాయపడతాయి. నిద్రపోయే ముందు గ్లాసు వేడినీళ్లు తాగితే త్వరగా నిద్రపడుతుంది. మానసిక ఒత్తిడిని తగ్గించడంలో కూడా వేడి నీళ్లు సహాయపడతాయి. గ్యాస్, ఎసిడిటీ సమస్యలు త్వరగా తగ్గుతాయి. కడుపు నొప్పి, అజీర్తి తదితర జీర్ణ సమస్యలు తగ్గిస్తుంది. వేడి నీరు తాగడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుంది. వేడి నీరు గొంతు సమస్యలు రాకుండా కాపాడుతుంది. జలుబు, న్యూమోనియా నుంచి దూరంగా ఉంచుతుంది. డయాబెటీస్ ముప్పు ఉందని భయపడేవారికి వేడి నీరు చక్కని ఔషధంగా పని చేస్తుంది. కీళ్ల నొప్పులతో బాధపడేవారికి ఆర్థరైటీస్ సమస్యలు రాకుండా కాపాడుతుంది. ఊబకాయం, అధిక బరువు వంటి సమస్యలను వేడి నీళ్లతో అధిగమించవచ్చు.


Post a Comment

0Comments

Post a Comment (0)