దోచుకున్నప్పుడు గుర్తు రాలేదా ?

Telugu Lo Computer
0


ఉక్రెయిన్‌లో ఆక్రమించుకున్న నాలుగు ప్రాంతాలను రష్యా రెఫరెండం ద్వారా తనలో విలీనం చేసుకుంది. ఈ విషయాన్ని పుతిన్ స్వయంగా ప్రకటించారు. దీంతో అమెరికా సహా యూరప్ దేశాలు రష్యాపై మండిపడుతున్నాయి. మరిన్ని ఆంక్షలు విధించేందుకు సిద్ధమవుతున్నాయి. జీ7 దేశాలు కూడా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పుతిన్.. పశ్చిమ దేశాల ద్వంద్వనీతిని ఎండగట్టారు. ఆ దేశాలు మధ్య యుగంలో అనేక దేశాలను లూటీ చేశాయని, అక్కడి ప్రజలను బానిసలుగా చూశామని గుర్తు చేశారు. ప్రజలను బానిసలుగా చేసి వ్యాపారం చేశాయని, అమెరికాలోని రెడ్ ఇండియన్ తెగల మీద మారణ హోమం జరిగిందని ఎండగట్టారు. అప్పటికే సంపన్నంగా ఉన్న భారత్ వంటి దేశాలను దోచుకున్నప్పుడు ఈ నీతి గుర్తుకు రాలేదా ? అని సూటిగా ప్రశ్నించారు. అలాగే ఆఫ్రికా దేశాలను పీల్చి పిప్పి చేశారని, చైనాకు వ్యతిరేకంగా ఇంగ్లండ్, ఫ్రాన్స్ యుద్ధాలు చేశాయని చరిత్ర పేజీలను ఉటంకించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)