కూలిన చీతా హెలికాప్టర్‌ : పైలెట్‌ మృతి - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 5 October 2022

కూలిన చీతా హెలికాప్టర్‌ : పైలెట్‌ మృతి


అరుణాచల్‌ ప్రదేశ్‌ చీతా హెలికాప్టర్‌ కూలిపోయినట్లు భారత ఆర్మీ పేర్కొంది. ఈ ఘటనలో పైలెట్‌, మృతి చెందగా, కో పైలెట్‌ తీవ్ర గాయాలపాలైనట్లు వెల్లడించింది. ఈ ప్రమాదం తవాంగ్‌ ప్రాంతంలో ఉదయం 10 గం.ల సమయంలో జరిగినట్లు తెలిపారు. ఈ చీతా హెలీకాప్టర్‌లో ఇద్దరు పైలెట్‌లు ప్రయాణిస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రమాదం సంభవించిన వెంటనే ఇద్దరు పైలెట్‌లను ఆర్మీ ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. లెఫ్టినెంట్‌ సౌరభ యాదవ్‌ పరిస్థితి చాలా విషమంగా ఉండటంతో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. అలాగే కో పైలెట్‌ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ఈ ప్రమాదానికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదని చెప్పారు. ఇదే ఏడాది మార్చిలో మరో చీతా హెలికాప్టర్‌ జమ్ము కాశ్మీర్‌ సరిహద్దుల్లో కూలిన సంగతి విధితమే. ఆఘటనలో కూడా పైలెట్‌ మృతి చెందగా, కోపైలెట్‌కి తీవ్ర గాయాలపాలయ్యాడు.

No comments:

Post a Comment