రావణుడే వారి దేవుడు !

Telugu Lo Computer
0


ఉత్తరప్రేదేశ్‌లోని, బిస్రాఖ్‌, బరాగావ్‌ అనే రెండు గ్రామాలు రావణ దహనం చేయరు, అలా చేయడాన్ని వ్యతిరేకిస్తారు. ఉత్తరప్రదేశ్‌లోని బాగాపత్‌ జిల్లాలో బరాగావ్‌ గ్రామం ఉంది. ఆ గ్రామవాసులు రావణుడిని దైవంగా భావిస్తారు. ఈ గ్రామాన్ని "రావణుడు" అని కూడా పిలుస్తారు. పురాణ కథనం ప్రకారం రావణుడు హిమాలయాల్లో ఘోర తపస్సు చేసి శక్తి పొందాడని, తనతో శక్తిని తీసుకువచ్చేటప్పడూ అతడు ఈ గ్రామం గుండా వెళ్లినట్లు కథనం. అయితే ఆ శక్తిని రావణుడు భరించలేకపోవడంతో ఆ గ్రామంలోని ఒక రైతుకి ఇచ్చాడని, అతను ఆ శక్తిని నేలపై పెట్టినట్లు చెబుతున్నారు. దీంతో శక్తి రావణడుతో తిరిగి వెళ్లేందుకు అంగీకరించకపోవడంతో ఏ ప్రదేశంలో శక్తి నెలపై ఉంచబడిందో అక్కడే మానసా దేవి ఆలయాన్ని నిర్మించి పూజించనట్లు ఆ ఆలయ పూజారి గౌరి శంకర్‌ పూరాణ కథను వివరించారు. అందువల్లే ఆ గ్రామంలో నివాసితులు ఈ పండుగను జరుపుకోవడానికి నిరాకరిస్తారు. అలాగే ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ్‌ బుద్‌ నగర్‌ జిల్లాలోని బిస్రాఖ్‌ వాసులు కూడా బరాగావ్‌ గ్రామ వాసుల మాదిరిగానే దసరాను జరుపుకోరు. అయితే ఈ గ్రామంలో కూడా రావణ, మేఘనాథ్‌, కుంభకర్ణలను దహనం చేసేందుకు ఒప్పుకోరట. పురాణల ప్రకారం విశ్రవ రుషికి జన్మించిన రావణుడి బాల్యం బిస్రాఖ్‌లో జరిగింది. లంకేశ్వరుడైన రావణుడు తమ గ్రామంలో జన్మించాడని, గొప్ప శివభక్తుడైన రావణుడు పూజించిన ఆలయం 'మహంత్‌ని' రావణ ఆలయంగా పిలుస్తామని ఆ గ్రామ నివాసి రామదాస్‌ చెబుతున్నారు. తమ గ్రామం రావణుడిని తమ ఊరి బిడ్డగా నమ్ముతోందన్నారు. అలాగే రావణుడు తండ్రి విశ్రవస్‌ వల్ల తమ గ్రామానికి పేరు వచ్చిందని తాము విశ్వాసిస్తామని చెప్పారు. అందుకు గర్విస్తున్నామని కూడా చెబుతున్నారు. మహారాష్ట్రలోని అకోలా జిల్లాలోని సంగోలా గ్రామం రావణుడిని తమ ఆరాధ్యం దైవంగా కొలుస్తోంది. రావణుడి ఆశీర్వాదం వల్లే తాము జీవనోపాధిని పొందుతున్నట్లు నమ్ముతారు. అంతేగాదు రావణుడి వల్లే తమ గ్రామం శాంతి సౌఖ్యాలతో ఉన్నట్లు గ్రామస్తులు విశ్వసిస్తారు. గత 300 ఏళ్లుగా ఆ గ్రామంలో రావణుడిని పూజించే సంప్రదాయం కొనసాగుతోందని నివాసితులు చెబుతున్నారు. పైగా రావణుడి అంత తెలివి, భక్తి పెంపొందాలని పూజలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)