సామాన్యులను అవమానించవద్దు ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday 23 October 2022

సామాన్యులను అవమానించవద్దు !


ఉచితాల నుంచి విముక్తి కల్పించాలని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ వివర్శలు గుప్పించారు. రాజకీయ నాయకులకు కూడా ఎన్నో ఉచితాలు అందుతున్నాయని గుర్తు చేశారు. కోటీశ్వరుల బ్యాంకు రుణాల మాటేమిటని ప్రశ్నించారు. పదే పదే ఉచితాలు రద్దు చేయాలంటు సామాన్యులను అవమానించవద్దని మండిపడ్డారు. ధరల పెరుగుదలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఉచిత విద్య, వైద్యం, ఔషధాలు ఇస్తే తప్పేంటని కేజ్రీవాల్ మోదీని ప్రశ్నించారు. ఈమేరకు ఆయన ఆదివారం హిందీలో ట్వీట్ చేశారు. మధ్యప్రదేశ్‌లోని సాత్నాలో పీఎం ఆవాస్ యోజన కింద మంజూరైన ఇళ్ల గృహ ప్రవేశాలను శనివారం వర్చువల్‌గా మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశానికి ఉచితాల నుంచి విముక్తి కల్పించాలన్నారు. ఎంతో మంది పన్ను చెల్లింపుదారులు తనకు ఈ విషయంపై చాలా లేఖలు పంపారని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోనూ షేర్ చేస్తూ మోదీపై విమర్శలకు ఎక్కుపెట్టారు కేజ్రీవాల్.


लोग महंगाई से बहुत ज़्यादा परेशान हैं। जनता को मुफ़्त शिक्षा, मुफ़्त इलाज, मुफ़्त दवाइयाँ, बिजली क्यों नहीं मिलनी चाहिए? नेताओं को भी तो इतनी फ्री सुविधायें मिलती हैं। कितने अमीरों के बैंकों के क़र्ज़े माफ़ कर दिये। बार बार मुफ़्त रेवड़ी बोलकर जनता का अपमान मत कीजिए

No comments:

Post a Comment