ఆర్ఎస్ఎస్-బీజేపీ భావజాలమే దేశాన్ని ముక్కలు చేస్తోంది

Telugu Lo Computer
0


భారత్ జోడో యాత్ర వెయ్యి కిలోమీటర్ల మైలు రాయి చేరుకున్న సందర్భంగా శనివారం బళ్లారిలో ఏర్పాటు చేసిన మెగా ర్యాలీని ఉద్దేశించి రాహుల్ మాట్లాడుతూఆర్ఎస్ఎస్, బీజేపీలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ''ఈ పాదయాత్రకు మేము భారత్ జోడో యాత్ర అని పేరు పెట్టడానికి కారణం ఆర్ఎస్ఎస్, బీజేపీలు దేశాన్ని ముక్కలు చేస్తున్నాయని ప్రజలు భావిస్తున్నారు. అందుకే దేశాన్ని ఏకం చేయడానికే భారత్ జోడో అని పేరు పెట్టాము. భారతీయ జనతా పార్టీ పాలనలో దేశం అతి తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటోంది. దేశంలో 45 ఏళ్ల గరిష్ట స్థాయిలో నిరుద్యోగం ఉంది. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని ప్రధానమంత్రి చెప్పారు. కానీ ఏమైంది? ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇవ్వడానికి బదులు.. ఏడాదికి రెండు కోట్ల మంది యువతను నిరుద్యోగులను చేస్తున్నారు'' అని రాహుల్ గాంధీ అన్నారు. 'కర్ణాటకలో 2.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఎందుకు ఉన్నాయి? సబ్-ఇన్‭స్పెక్టర్ ఉద్యోగం కావాలంటే 80 లక్షల రూపాయలు చెల్లించుకోవాల్సి వస్తోంది. నీ దగ్గర డబ్బులు ఉంటేనే ప్రభుత్వం ఉద్యోగం దక్కే పరిస్థితులు దాపురించాయి. ఒకవేళ నీ దగ్గర డబ్బులు లేకపోతే, ఇక నువ్వెప్పటికీ నిరుద్యోగిగానే మిగిలిపోతావు'' అని కర్ణాటకలోని నిరుద్యోగాన్ని ఉద్దేశించి రాహుల్ అన్నారు.


Post a Comment

0Comments

Post a Comment (0)