అదానీ పోర్ట్స్‌కు అనుబంధ సంస్థగా గంగవరం పోర్టు

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని గంగవరం పోర్టులో 58.1 శాతం వాటాను డీవీఎస్‌ రాజు, ఆయన కుటుంబం నుంచి షేర్ల మార్పిడి పద్ధతిలో కొనుగోలు చేయడానికి అదానీ పోర్ట్స్‌ అండ్‌ ఎస్‌ఈజడ్‌ లిమిటెడ్‌కు జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌ అహ్మదాబాద్‌ బెంచి, హైదరాబాద్‌ బెంచి అనుమతి ఇచ్చాయి. గతంలోనే గంగవరం పోర్టులో 31.5 శాతం వాటాను వార్‌వర్గ్‌ పింకస్‌ నుంచి, 10.4 శాతం వాటాను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి అదానీ పోర్ట్స్‌ కొనుగోలు చేసింది. ఎన్‌సీఎల్‌టీ అనుమతితో మిగిలిన వాటాను కూడా సొంతం చేసుకున్నట్లు, దీంతో గంగవరం పోర్టు తనకు నూరు శాతం అనుబంధ సంస్థగా మారినట్లు అదానీ పోర్ట్స్‌ అండ్‌ ఎస్‌ఈజడ్‌ లిమిటెడ్‌ సోమవారం వెల్లడించింది. గంగవరం పోర్టుతో దేశంలో సరకు రవాణా సేవల రంగంలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించే అవకాశం తమకు లభించినట్లు అవుతోందని అదానీ పోర్ట్స్‌ సీఈఓ కరణ్‌ అదానీ పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)