రాత్రుళ్లు చపాతీ తో పాటు కొంత అన్నం తినండి !

Telugu Lo Computer
0


రాత్రివేళల్లో వైట్ రైస్‌కు బదులుగా చాలా మంది  చపాతీలు తింటున్నారు. అయితే బరువును కంట్రోల్‌లో పెట్టుకునేందుకు ఇలా ఉన్నఫలంగా రాత్రి వేళల్లో వైట్ రైస్ మానేయడం మంచిది కాదని డాక్టర్లు అంటున్నారు. డైట్‌లో భాగంగా ఒక పూట మొత్తంగా రైస్ మానేయడం కంటే అన్నం తక్కువ తీసుకుని ఆ స్థానంలో చపాతీలు తినాలని వైద్యుల సూచన. రాత్రుళ్లు వేడివేడిగా చపాతీలు చేసుకుని తినడం కంటే.. నిల్వ ఉన్న చపాతీలు తింటే ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అలాగే అప్పటికప్పుడు చేసిన చపాతీల్లో నూనె కంటెంట్ తక్కువగా ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. సాధారణంగా ఎక్కువ సేపు నిల్వ ఉండే ఆహార పదార్ధాలలో పోషకాలు అంతమైపోతాయి. చపాతీలు, రోటీలు ఎంత ఎక్కువ సేపు నిల్వ ఉంటే ఆరోగ్యానికి అంత మంచిదని డాక్టర్లు తెలిపారు. అందుకే రాత్రిపూట నిల్వ ఉంచిన చపాతీలు తినాలని, అలా తినడం వల్ల బ్లడ్ ప్రెషర్, అల్సర్స్, గ్యాస్ వంటి కడుపు సంబంధిత రోగాలు దరికి చేరవని వైద్య నిపుణులు అంటున్నారు. మరోవైపు రక్త హీనతతో బాధపడుతున్న వారికి కూడా చపాతీలు తినడం వల్ల ఎంతో ఉపయోగం ఉంటుందట.

Post a Comment

0Comments

Post a Comment (0)