ఓఆర్ఎస్ సృష్టికర్త డాక్టర్ దిలీప్ మహాలనబిస్ కన్నుమూత

Telugu Lo Computer
0


ఓఆర్ఎస్ సృష్టికర్త  డాక్టర్ దిలీప్ మహాలనబిస్ (88) కోల్‌కతాలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో ఆదివారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. డాక్టర్ దిలీప్ మహాలనబిస్ వైద్య రంగంలో విశిష్ట సేవలందించారు. ఆయన 1971లో బంగ్లాదేశ్ ఏర్పాటు సంక్షోభ సమయంలో శరణార్థులకు వైద్య సేవలు అందించారు. ఈ సమయంలో చాలా మంది ప్రజలు డయేరియా వల్ల డీహైడ్రేషన్‌తో మరణించారు. తన కళ్లముందే భారీ సంఖ్యలో రోగులు చనిపోతుండటంతో దీనికి పరిష్కారం కోసం ఆలోచించారు. డీ హైడ్రేషన్‌ను తగ్గించి, తక్షణ శక్తినిచ్చి, ప్రాణాలు నిలబెట్టే ఓఆర్ఎస్ ఫార్ములాను తయారు చేశాడు. నీళ్లు, గ్లూకోజ్, ఇతర లవణాలు కలిపి దీన్ని తయారు చేశాడు. ఈ ఆవిష్కరణతో ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలు నిలబడ్డాయి. ఈ ఆవిష్కరణను అప్పట్లో 'ది లాన్సెట్' అనే మెడికల్ జర్నల్ 20వ శతాబ్దపు ముఖ్యమైన ఆవిష్కరణగా పేర్కొంది. డాక్టర్ దిలీప్ మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)