నరబలి అవయాలు రూ. 20 లక్షలకు డీల్ ?

Telugu Lo Computer
0


కేరళలో జరిగిన మహిళల నరబలి కేసు రోజుకో  మలుపు తిరిగింది. మంత్రగాడిని నమ్ముకున్న వైద్యుడు ఇద్దరు మహిళలను అతని ఇంట్లోనే చంపేశాడు. నరబలి ఇవ్వడానికి నాటు వైద్యుడు నకిలి మాంత్రికుడికి లక్షల రూపాయల డబ్బులు ఇచ్చాడని, నరబలి తరువాత మహిళల అవయావలు లక్షల రూపాయలకు విక్రయించారని పోలీసుల విచారణలో వెలుగు చూడటం కలకలం రేపింది. బెంగళూరుకు చెందిన ఓ మాంత్రికుడికి మహిళల నర మాంసంతో పాటు వాళ్ల అవయవాలు రూ. 20 లక్షలకు డీల్ జరిగిందని కేసు విచారణ చేస్తున్న ఓ పోలీసు అధికారి అంటున్నారు. మాంత్రికుడు మోహమ్మద్ షఫీనే బెంగళూరులో ఉన్న మరో మాంత్రికుడితో ఈ డీల్ మాట్లాడడని విచారణలో నిందితులు అంగీకరించారని పోలీసులు అంటున్నారు. కేరళ నరబలి కేసులో పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నరబలి ఇవ్వడానికి నాటు వైద్యుడు భగవార్ సింగ్ నకిలి మాంత్రికుడు మోహమ్మద్ షఫీ చేతికి అడ్వాన్ గా రూ. లక్షల రూపాయలు ఇచ్చాడని, ఈ విషయం మంత్రగాడు మోహమ్మద్ షఫీ స్వయంగా అంగీకరించాడని పోలీసులు అంటున్నారు. నరబలి ఇవ్వడానికి నాటు వైద్యుడు భగవార్ సింగ్ నకిలి మాంత్రికుడుడు మోహమ్మద్ షఫీకి రూ. 6 లక్షలు డబ్బులు ఇచ్చాడని, అయితే షఫీ ఆ డబ్బు చాలదు అని డాక్టర్ కు చెప్పాడని, నరబలి తరువాత పధ్మా, రోసలిన్ అవయావలు లక్షల రూపాయలకు విక్రయించాలని స్కెచ్ వేశారని పోలీసుల విచారణలో వెలుగు చూడటం కలకలం రేపింది. డాక్టర్ భగవార్ సింగ్ ఇంట్లో మొదల రోసలిన్ ను నరబలి ఇచ్చారు. ఆ సందర్బంలో బెంగళూరు మాంత్రికుడు వచ్చిన రోసలిన్ అవయవాలు తీసుకెలుతాడని మోహమ్మద్ షఫీ భగవార్ సింగ్, లైలా దంపతులను నమ్మించాడు. అయితే ఆ సందర్బంలో బెంగళూరు నుంచి ఎవ్వరు రాకపోవడంతో ఆ మాంసం పాతిపెట్టారని, కొన్ని ముక్కలు ఫై ఓవర్ కింద విసిరేశామని మోహమ్మద్ షఫీ అంగీకరించాడని పోలీసులు అంటున్నారు. బెంగళూరుకు చెందిన ఓ మాంత్రికుడికి మహిళల నర మాంసంతో పాటు వాళ్ల అవయవాలు రూ. 20 లక్షలకు విక్రయించడానికి డీల్ జరిగిందని కేసు విచారణ చేస్తున్న ఓ పోలీసు అధికారి అంటున్నారు. మాంత్రికుడు మోహమ్మద్ షఫీనే బెంగళూరులో ఉన్న మరో మాంత్రికుడితో ఈ డీల్ మాట్లాడడని విచారణలో నిందితులు అంగీకరించారని పోలీసులు అంటున్నారు. పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఫ్లై ఓవర్ కింద మహిళల శరీర అవయవాలు స్వాధీనం చేసుకున్నామని, ఆ మాంసం 10 కేజీలకు పైగా ఉందని, ఆ మాంసం ముక్కలు అక్కడ విసిరేశామని మంత్రగాడు మోహమ్మద్ షఫీ సమాచారం ఇచ్చాడని పోలీసులు అంటున్నారు. రోసలిన్, పధ్మాలను నరబలి ఇచ్చిన తరువాత డాక్టర భగవార్ సింగ్, లైలా దంపతులు ఆ మాంసం కుక్కర్ లో ఉడకబెట్టి మటన్ కూర చేసుకుని తిన్నారని, ఆ కుక్కర్ స్వాధీనం చేసుకున్నామని, మాంసం ముక్కలును ల్యాబ్ కు పంపించామని కేసు విచారణ చేస్తున్న పోలీసు అధికారులు అంటున్నారు. నరబలి ఇచ్చిన తరువాత డాక్టర్ భగవార్ సింగ్, లైలా దంపతులను బ్లాక్ మెయిల్ చేసి భారీ మొత్తంలో డబ్బులు లాక్కొవాలని మంత్రగాడు మోహమ్మద్ షఫీ స్కెచ్ వేశాడని, చివరి అందరూ అరెస్టు అయ్యారని పోలీసు అధికారులు అంటున్నారు. అయితే బెంగళూరులో ఉన్నా ఆ మాంత్రికుడు ఎవరు ?, మోహమ్మద్ షఫీ చెబుతున్నది నిజమేనా ? అని ఆరా తీస్తున్నామని పోలీసు అధికారులు అంటున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)