మూడు రోజులపాటు భారీవర్షాలు

Telugu Lo Computer
0

వచ్చే మూడు రోజులపాటు తొమ్మిది  రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ వెల్లడించింది. మంగళవారం నుంచి మూడు రోజులపాటు ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమబెంగాల్, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో భారీవర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు చెప్పారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని కోస్తా జిల్లాలైన సౌత్ 24 పరగణాస్, పుర్బా, పశ్చిమ మేదీనీపూర్, కోల్ కతా ప్రాంతాల్లో మంగళవారం నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. ఉరుములు,మెరుపులతో కూడిన భారీవర్షాల వల్ల దుర్గా పూజ ఉత్సవాలకు ఆటంకం కలగనుంది. ఉత్తర బెంగాల్, డార్జిలింగ్, కలింపొంగ్ ప్రాంతాల్లో బుధవారం నుంచి భారీవర్షాలు కురుస్తాయని అధికారులు చెప్పారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కుమాన్, గర్హాల్ ప్రాంతాల్లో అతి భారీవర్షాలు కురిసే అవకాశమున్నందున ఐఎండీ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. వచ్చే రెండు రోజుల్లో అల్పపీడన ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోస్తా జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.

Post a Comment

0Comments

Post a Comment (0)