బల్లి పడితే ఆహారం విషపూరితం అవుతుందా ?

Telugu Lo Computer
0


బల్లి పేరు చెప్పగానే చాలా మంది ఉలిక్కిపడతారు. మరికొందరు భయపడుతుంటారు. ఇంకొందరు అయితే అపశకునంగా భావిస్తారు. అయితే, నిజానికి వాటికి దక్కాల్సిన సముచిత స్థానం వాటికి దక్కడం లేదు. జీవావరణ సమతౌల్యతలో అవి కూడా తమ వంతు పాత్ర పోషిస్తుంటాయి. కీటకాలను నియంత్రించడంలో బల్లులు ప్రధాన పాత్ర పోషిస్తాయి. మనం సాధారణంగా మన ప్రపంచం నిండా జీవులే అని చెబుతాం.జీవులకు బదులుగా మనం కీటకాలే అని చెప్పుకోవాలి. ఎందుకంటే మన ప్రపంచంలో కీటకాల జనాభా చాలా పెద్దది. కీటకాలు లేకపోతే ఈ ప్రపంచాన్ని మనం అసలు ఊహించుకోలేం. అలాగే కీటకాలు మరీ ఎక్కువైనా పరిస్థితులు భయానకంగా మారిపోతాయి. అందుకే ఇక్కడ అసమతౌల్యత అవసరం. దీన్ని సరిచూడటంలో బల్లులు ప్రధాన పాత్ర పోషిస్తాయి. దోమలు, ఈగలు లాంటి కీటకాల జనాభా నియంత్రణలో బల్లులు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఆ తర్వాత ఈ బల్లులను పక్షులు తింటాయి. అలా ఆహారపు గొలుసు ముందుకు వెళ్తుంటుంది. రాత్రిపూట ఎక్కువగా సంచరించే దోమలు, ఈగలు, పురుగులు, ఇతర కీటకాలను బల్లులు ఆహారంగా తీసుకుంటాయి. సాధారణంగా మన ఇళ్లలో కనిపించే బల్లులను హౌస్, గార్డెన్/ట్రీ లిజర్డ్స్‌గా పిలుస్తారు. వీటిలో కూడా చాలా రకాలు ఉన్నాయి.  నిజానికి బల్లుల చుట్టూ చాలా అపోహలు ఉన్నాయి. అవి ఎదురైతే మంచిది కాదని, అపశకునమని అనుకుంటాం. ఆహారంలో బల్లి పడితే, అది విషపూరితం అవుతుందని కూడా చెబుతారు. బల్లి పడినంత మాత్రాన ఆహారం విషపూరితం కాదు. నిజానికి బల్లుల్లో మనషులను చంపేంత విషం ఉండదు. పరిశోధనలు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించాయి. క్కోసారి బల్లి పడిన ఆహారాన్ని తీసుకుంటే వాంతులు, తలనొప్పి లాంటివి కలగొచ్చు. ఇవన్నీ అలర్జీ వల్లే వస్తాయి. ఈ లక్షణాలను మందులతో మనం తగ్గించుకోవచ్చు.

Post a Comment

0Comments

Post a Comment (0)