జీఎస్ఎల్వీ మార్క్-3 రాకెట్ ప్రయోగం విజయవంతం

Telugu Lo Computer
0


శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఇస్రో నిర్వహించిన జీఎస్ఎల్వీ మార్క్-3 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. అర్ధరాత్రి 12:07 గంటలకు నింగిలోకి దూసకెళ్లిన జీఎస్ఎల్వీ, ప్రైవేట్ కమ్యూనికేషన్ సంస్థ వన్‌వెబ్‌కు చెందిన 36 ఉపగ్రహాలను నిర్ణీత కక్షలోకి చేర్చింది. ఇస్రో చరిత్రలో జీఎస్ఎల్వీ రాకెట్ మొదటి సారిగా 6టన్నుల పేలోడ్‌ను మోసుకెళ్లింది. ఇది తీసుకెళ్లిన 36శాటిలైట్లు పూర్తిగా విదేశాలకు చెందినవే. న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అనే సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు వన్‌వెబ్‌కు చెందిన 36శాటిలైట్లనులో ఎర్త్ ఆర్బిట్ (ఎల్ఈఓ)లో ప్రవేశపెట్టింది. మొత్తం 9 బ్యాచ్‌లలో 36 ఉపగ్రహాలు కక్ష్యలోకి చేరాయి. ఒక్కో ఉపగ్రహం 142 కిలోల బరువు ఉంటుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)