రుషికొండలో సీఎం నివాసం కడితే తప్పేంటి ?

Telugu Lo Computer
0


అచ్చెన్నాయుడు మనిషి పెరిగాడు కానీ బుర్ర పెరగలేదు. మూడున్నరేళ్లలో ఉత్తరాంద్రకు ఏమి చేశారని అడుగుతున్న టీడీపీ నేతలు వాళ్ళు హయాంలో ఏం చేశారో చెప్పగలరా…? ఉత్తరాంద్ర అభివృద్ధి అంతా వైఎస్సార్ హయాంలోనే జరిగింది. 175 స్థానాలు గెలుస్తాం, ఆ దిశగా మా ప్రణాళికలు ఎప్పుడు ఉంటాయి, జగన్ ప్రభుత్వం మళ్ళీ వస్తుంది. విశాఖలో భూముల రికార్డులు మాయం చేసిన దౌర్భాగ్యులా మా గురించి మాట్లాడేది….? ఋషికొండలో చేపట్టిన నిర్మాణాలు సీఎం క్యాంప్ కార్యాలయం అని మంత్రి బొత్స సత్యనారాయణ పరోక్షంగా చెప్పేశారు. ఋషికొండలో ముఖ్యమంత్రి అధికారిక నివాసం కడితే తప్పేంటి.? అని బొత్స ప్రశ్నించారు. విశాఖకు ఎగ్జిక్యూటివ్ కేపిటల్ రావాల్సిందే. అడ్డుకుంటే చరిత్ర హీనులు అవుతారు. పరిపాలన వికేంద్రీకరణను వ్యతిరేకిస్తున్న టీడీపీ రైతుల రూపంలో రావడం ఎందుకు…నేరుగా టీడీపీ కండువాలు కప్పుకుని రావొచ్చు కదా….!?రాజకీయాలు పలుచన కావడానికి నాయకుల వ్యవహారశైలి, మాట తీరే కారణం…అశోక్ గజపతి రాజు విజయనగరం అభివృద్ధికి ఏం చేశారో చెప్పగలరా…..!?మీ హయాంలో ఏం జరిగిందో చెప్పడానికి సిద్ధం….? ప్రజలకు తాగునీరు ఇచ్చే రామతీర్థం ప్రాజెక్ట్ ను అశోక్ గజపతి రాజు అడ్డుకున్నారు. ఏపీ విభజన చట్టంలో ఉన్న యూనివర్శిటీ కూడా తెచ్చుకో లేకపోయారు. అమరావతిలో ఎందుకు కేపిటల్ వద్దో……విశాఖలో ఎందుకు కావాలో చెప్పడానికి నేను సిద్ధం. త్వరలోనే ఋషికొండ కు అఖిలపక్షం తీసుకెళ్లి చూపిస్తాం…అక్కడ ప్రభుత్వ నిధులతో ప్రభుత్వ భవనాలు కడితే తప్పేంటి…? టీడీపీకి దురుద్దేశాలు తప్ప వాస్తవికత ఉండదు…. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తిగా ఇప్పుడు ఉన్న నేతలు భావించడం లేదన్నారు  బొత్స సత్యనారాయణ. హరీష్ రావు ఒకసారి ఏపీకి వచ్చి ఇక్కడి టీచర్లతో మాట్లాడి వాస్తవాలు తెలుసుకోవాలి. తెలంగాణ పీఆర్సీ.. ఆంధ్రా పీఆర్సీ పక్కపక్కన బెట్టి చూసుకుంటే అప్పుడు తేడా తెలుస్తుందన్నారు . పరిశీలన లేకుండా ఎందుకు వచ్చిన మాటలు. మన దగ్గర ఉపాధ్యాయులు సంతోషంగా ఉన్నారన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)