రాణి కాళ్లపై పడ్డ ఇన్‌ఫోసిస్‌ సుధా మూర్తి ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 28 September 2022

రాణి కాళ్లపై పడ్డ ఇన్‌ఫోసిస్‌ సుధా మూర్తి !

 

ఇన్‌ఫోసిస్‌ చైర్‌ పర్సన్, సంఘ సేవకురాలు సుధామూర్తి గురించి తెలియని వారుండరూ. రచయిగా కూడా ఆమె సుపరిచితురాలు. ఇక, వివాదాలకు దూరంగా ఉండే సుధామూర్తి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చర్చకు కారణమయ్యారు. గతంలో ఆమె చేసిన ఓ పని నెట్టింట పెద్ద డిబేట్‌కు తెర తీసింది. 2019లో సుధామూర్తి మైసూర్‌ రాణి కాళ్లపై పడ్డారు. అప్పటి ఫొటో ఇప్పుడు వైరల్‌గా మారింది. నెటిజన్లు రెండు గ్రూపులుగా విడిపోయారు. ఓ గ్రూపు సుధామూర్తి చేసిన పనిని సమర్థిస్తుంటే, ఇంకో గ్రూపు ఆమె చేసిన పనిని తప్పుబడుతోంది. '' ఈ కాలంలో కూడా రాజులు, రాణుల కాళ్లపై పడ్డం ఏంటి?''.. '' సుధామూర్తి ఎందుకలా చేశారు? రాజ కుటుంబీకుల కాళ్లపై పడ్డం ఓ ఆచారమా? గౌరవం కోసం అలా చేశారా?''.. '' ఓరి దేవుడా! సుధామూర్తి రాజరికానికి తలవించిందా? మనం ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా.. మన మైండ్‌ సెట్‌ మారదు.. మనల్ని ఎవ్వరూ బాగు చేయలేరు''.. అని కొంతమంది కోప్పడుతుంటే.. మరికొంతమంది '' ఆమె చేసిన దాంట్లో తప్పేముంది. తన కంటే రాణి వయసులో పెద్ద కాబట్టి గౌరవిస్తూ అలా చేసింది కాబోలు''.. '' ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్న భావనలో ఆమె అలా చేసి ఉండొచ్చు'' అని అంటున్నారు. 2019లో మైసూర్‌ సంస్థానాన్ని పాలించిన చివరి రాజు జయచామ రాజ వడయార్‌ జయంతి వేడుకలకు సుధామూర్తికి ఆహ్వానం అందింది. ఆ జయంతి వేడుకలకు సుధామూర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీకాంతదత్త నరసింహ రాజ వడయార్‌ భార్య ప్రమోదా దేవి వడయార్‌ కాళ్లపై సుధామూర్తి పడ్డారు. రాణి ప్రమోదా దేవి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ ఫొటోలో ప్రమోదా దేవి పక్కన ప్రముఖ సీనియర్‌ నటి సరోజా దేవి కూడా ఉండటం విశేషం.

No comments:

Post a Comment