కట్టుకున్న భార్యను కడతేర్చిన భర్త - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 28 September 2022

కట్టుకున్న భార్యను కడతేర్చిన భర్త


బెంగుళూరులో హగరిబొమ్మనహళ్లి పరిధిలోని బ్యాసగదేరి గ్రామానికి చెందిన రవి కుమార్ (32) తన దగ్గరి బంధువులు అమ్మాయి అయిన దీప (21)ను వివాహం చేసుకున్నాడు. వీరికి పెళ్లి జరిగి ఏడాదిన్నర కావస్తుంది. పెళ్లైన కొంత కాలం పాటే ఈ దంపతులు సంతోషంగా జీవించారు. రవి కుమార్ నిత్యం ఏదో ఒక గొడవ చేస్తూ భార్య దీపను అనుమానంతో వేధిస్తుండేవాడు. అలా వీరి దాంపత్య జీవితంలో సంతోషం దూరమై, వివాదాలు, మనస్పర్దలు దగ్గరయ్యాయి. ఈ నేపథ్యంలోనే తరుచు గొడవలు జరుగుతుండేవి. రవి కుమార్ ప్రవర్తనపై స్థానికులు సైతం విసిగిపోయ్యారు. అయితే సోమవారం రాత్రి కూడా ఈ దంపతులు మధ్య మరోసారి గొడవ జరిగింది. దీంతో భార్యాభర్తలిద్దరూ ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు. కోపంతో ఊగిపోయిన భర్త రవి కుమార్ కట్టుకున్న భార్య అని చూడకుండా రవికుమార్  దీప గొంతు నులిమి దారుణంగా హత్య చేశాడు. అనంతరం భార్య శవాన్ని తీసుకెళ్లి అదే గ్రామంలో ఉంటున్న అత్తమామల ఇంటి వదిలేసి పారిపోయాడు. అనంతరం కూతురి శవాన్ని చూసిన దీప తల్లిదండ్రులు కన్నీరు మున్నిరుగా విలపించారు.  భర్త దారుణంపై దీప తల్లిదండ్రులు భర్తతో పాటు అత్తింటి కుటుంబ సభ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రవి కుమార్ తో పాటు అత్తమామలను అదుపులోకి తీసుకున్నారు. 

No comments:

Post a Comment