ఏడాదికి 15 సిలిండర్లే ?

Telugu Lo Computer
0


ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల సంఖ్యను ప్రభుత్వం పరిమితం చేసినట్లు తెలుస్తోంది. కొత్త నిబంధన ప్రకారం.. ఇప్పుడు వినియోగదారులు ఏడాదికి కేవలం 15 సిలిండర్లను మాత్రమే కొనుగోలు చేయగలరు. అయితే LPG సిలిండర్లపై నెలవారీ రేషన్ నెలకు 2 సిలిండర్లుగా నిర్ణయించటం జరిగింది. వినియోగదారుడు నెలలోపు రెండు కంటే ఎక్కువ సిలిండర్లు తీసుకోరాదు. అయితే గతంలో ఇలాంటి పరిమితులు లేవు. డిస్ట్రిబ్యూటర్లు ఇచ్చిన సమాచారం మేరకు రేషన్ కోసం సాఫ్ట్‌వేర్‌ను మార్చారు. ఇది తక్షణం అమలులోకి వచ్చింది. వాణిజ్యపరమైన వాటి కంటే చౌకగా ఉన్నందున దేశీయంగా సబ్సిడీ లేని రీఫిల్‌లను ఉపయోగిస్తున్నట్లు చాలా కాలంగా చమురు కంపెనీలకు ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ క్రమంలో దుర్వినియోగానికి అడ్డుకట్టవేసేందుకు తాజా నిర్ణయం అమలులోకి వచ్చిందని తెలుస్తోంది. తాజా పరిమితులకు మించి సిలిండర్లను కస్టమర్లు పొందాలనుకుంటే అవసరానికి సంబంధించిన సపోర్టింగ్ డాక్యుమెంట్లను డిస్ట్రిబ్యూటర్లకు అందించాల్సి ఉంటుంది. మెుత్తం 15 సిలిండర్ల వరకు పరిమితి ఉన్నప్పటికీ.. సబ్సిడీ డొమెస్టిక్ గ్యాస్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ఏడాదికి 12 సిలిండర్లు మాత్రమే తక్కువ ధరలకు లభిస్తాయి. అంతకు మించి వాడుకునే సిలిండర్లపై ఎలాంటి తగ్గింపులు ఉండవు. గత 5 ఏళ్ల మోదీ ప్రభుత్వ హయాంలో వంట గ్యాస్ సిలిండర్ల ధరలు ఏకంగా 58 సార్లు సవరించబడ్డాయి. దీనివల్ల గ్యాస్ ధరలు ఏకంగా 45 శాతం పెరిగాయి. ఈ కారణంగా LPG ధరలు పెరుగుతూ పోతున్నాయి. సామాన్యులకు ఇవి మోయలేని భారంగా మారాయి. ఇదే క్రమంలో ఉజ్వల స్కీమ్ కింద ఉన్న వారికి మాత్రమే సబ్సిడీ అందిస్తూ.. మిగిలిన ప్రజలకు దానిని తొలగించి మోదీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ద్రవ్యోల్బణం సమయంలో ప్రజలు దీనిపై కొంత అసహనానికి గురవుతున్నారు. ఏప్రిల్ 2017లో ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.723గా ఉంది. అప్పటి నుంచి 45 శాతం పెరిగిన తర్వాత గ్యాస్ ధర జూలై 2022 నాటికి రూ.1,053కి చేరుకుంది. జూలై 2021లో గ్యాస్ సిలిండర్ ధర రూ.834గా ఉన్నాయి. LPG సిలిండర్ ధరలు ప్రతి రాష్ట్రంలో వేరువేరుగా ఉంటాయి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలు విధించే VAT రేటు, రవాణా ఛార్జీల ఆధారంగా స్వల్ప మార్పులు ఉంటుంటాయి. ప్రస్తుతం దేశంలో ప్రతి నెల మెుదటి తారీఖున రేట్లను చమురు కంపెనీలు మారుస్తున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)