కబ్జా గురైన వాణిశ్రీ భూమిని అప్పగించిన స్టాలిన్

Telugu Lo Computer
0


ప్రముఖ నటి వాణిశ్రీ భూమిని కొందరు నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఆ భూమి విలువ ప్రస్తుత మార్కెట్‌లో రూ.20 కోట్లకు పై మాటేనట ! అయితే, నకిలీ పత్రాలతో జరిగిన రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసి, ఆ భూమిని తిరిగి వాణిశ్రీకి అందించింది తమిళనాడు ప్రభుత్వం. సీఎం స్టాలిన్ స్వయంగా.. ఆ భూమి పత్రాలను వాణిశ్రీకి అందించారు.. మొత్తం ఐదుగురి భూములను కబ్జాదారుల చెర నుంచి ఆ భూమిని కాపాడి, తిరిగి యజమానులకు అందించారు. వారిలో వాణిశ్రీ ఒకరు. సీఎం స్టాలిన్‌ చేతుల మీదుగా సంబంధిత భూమి పత్రాలు అందుకున్న వాణిశ్రీ ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ రూ. 20 కోట్ల విలువైన తన భూమిని ఫేక్‌ సర్టిఫికెట్లతో కబ్జా చేశారు. దీనిపై ఎంతో మందికి మొరపెట్టుకున్నాను. ఎందరినో కలిశాను. తాను 11 ఏళ్లుగా తిరిగి తిరిగి అలసిపోయానని, ఇకపై ఆ భూమిపై పైసా కూడా ఖర్చు పెట్టకూడదనే నిర్ణానికి వచ్చాను.. కానీ, ముఖ్యమంత్రి స్టాలిన్‌ కల్పించుకుని.. తన భూమిని తిరిగి ఇప్పించారని ఆనందాన్ని వ్యక్తం చేశారు.. ఆయన చల్లగా ఉండాలని, మంచి పాలన అందిస్తూనే ఉండాలని వాణిశ్రీ ఆకాంక్షించారు. 


Post a Comment

0Comments

Post a Comment (0)