అణు వినాశనంపై ఆంటోనియో గుటెరస్‌ హెచ్చరిక

Telugu Lo Computer
0


50 ఏళ్ల కిందట చేసుకొన్న అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్‌పీటీ)పై సమీక్షకు సుదీర్ఘకాల జాప్యం తర్వాత సోమవారం మొదలైన ఉన్నతస్థాయి ప్రతినిధుల సమావేశంలో  ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ ప్రారంభ ఉపన్యాసం చేస్తూ ప్రపంచ మానవాళి నేడు అణు వినాశనానికి కేవలం ఒక్క అడుగు దూరంలో ఉందన్నారు.  ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ మధ్య ప్రాచ్యం, ఆసియా ప్రాంతాల్లో నెలకొన్న అణ్వాయుధ భయాలు మనల్ని విపత్తు దిశగా తీసుకువెళుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నెల రోజులపాటు కొనసాగే ఈ సదస్సు అణ్వాయుధ భయాలను తొలగించి, మానవాళికి సరికొత్త పథాన్ని చూపడానికి చక్కటి అవకాశమన్నారు. 'దాదాపు 13,000 అణ్వాయుధాలు ప్రపంచ ఆయుధాగారాల్లో ఉన్నాయి. భద్రతపై లేనిపోని భయాలతో ప్రళయకాల ఆయుధాల కోసం రూ.వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు' అని గుటెరస్‌ తెలిపారు. ఆగస్టు 26న ఈ సదస్సు ముగిసేనాటికి తదుపరి చర్యలపై అందరం ఏకాభిప్రాయానికి రావాలని పిలుపునిచ్చారు. యూఎన్‌ న్యూక్లియర్‌ చీఫ్‌ రఫేల్‌ గ్రాసి, యూఎస్‌ సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ ఆంటోనీ బ్లింకెన్‌, జర్మనీ విదేశాంగ మంత్రి అన్నాలీనా బేర్‌బాక్‌ తదితరులు మాట్లాడారు.


Post a Comment

0Comments

Post a Comment (0)