వివేకా హత్య కేసు నిందితులకు బెయిల్ పిటిషన్ కొట్టివేత

Telugu Lo Computer
0


మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో ముగ్గురు నిందితులకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. వై.సునీల్‌ యాదవ్‌ (ఏ2), గజ్జల ఉమాశంకర్‌రెడ్డి (ఏ3), దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి (ఏ5) దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్లను కోర్టు కొట్టేసింది. దర్యాప్తు కొనసాగుతోందని, గతంలో వేసిన బెయిలు పిటిషన్లను కొట్టేశాక పరిస్థితుల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదని పేర్కొంది. దిగువ కోర్టులో సీబీఐ అభియోగపత్రం దాఖలు చేయడాన్ని పరిస్థితుల్లో మార్పు చోటు చేసుకున్నట్లు పరిగణించలేమని తేల్చిచెప్పింది. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డి.రమేశ్‌ బెయిలు పిటిషన్లను కొట్టేస్తూ సోమవారం కీలక తీర్పు ఇచ్చారు. వివేకా హత్య కేసులో నిందితులైన సునీల్‌ యాదవ్‌, ఉమాశంకర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి బెయిలు పిటిషన్లపై వాదనలు ముగియడంతో తీర్పును వాయిదా వేసిన న్యాయమూర్తి సోమవారం నిర్ణయాన్ని వెల్లడించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)