బిగ్‌బాస్‌ షోలో పాల్గొనబోయే వారు ? - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday, 7 August 2022

బిగ్‌బాస్‌ షోలో పాల్గొనబోయే వారు ?


బుల్లితెర ప్రేక్షకులు. బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌ తర్వాత నాన్‌స్టాప్‌ పేరుతో ఓటీటీలో బిగ్‌బాస్‌ ప్రారంభమైనా అది అందరికీ చేరువవలేదు. కేవలం హాట్‌స్టార్‌ను వీక్షించేవారు మాత్రమే దాన్ని చూసేందుకు వీలుండటంతో చాలావరకు ఫ్యామిలీ ఆడియన్స్‌ ఈ రియాలిటీ షోను మిస్సయ్యారు. అయితే వారి నిరీక్షణకు తెరదించుతూ త్వరలోనే షో ప్రారంభం కానుంది. ఎప్పటిలాగే ఈసారి కూడా సెప్టెంబర్‌లో కొత్త సీజన్‌ ఘనంగా లాంచ్‌ కానుంది. ఇందుకోసం కంటెస్టెంట్ల ఎంపిక దాదాపు పూర్తి కావొచ్చింది. కానీ కొందరు మాత్రం ఇంకా రావాలా? వద్దా? అన్న మీమాంసలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం దీపికా పిల్లి, నేహా చౌదరి, శ్రీహాన్‌, ఆర్జే సూర్య, యాంకర్‌ ఉదయభాను, అమర్‌దీప్‌, ఆదిరెడ్డి, చలాకీ చంటి, గీతూ రాయల్‌ షోలో అడుగు పెట్టబోతున్నారట!. గత సీజన్‌లో సిరి రాగా, ఈసారి సిరి బాయ్‌ ఫ్రెండ్‌ శ్రీహాన్‌ వస్తుండటంతో అతడి మీద భారీ అంచనాలే ఉన్నాయి. బుల్లితెర నటుడు అమర్‌దీప్‌ ఇటీవలే తన ప్రేయసి, సహనటి తేజస్వితో నిశ్చితార్థం జరుపుకున్నాడు. మరి అతడు పెళ్లిని వాయిదా వేసుకుని వస్తాడా? లేదంటే త్వరగా పెళ్లి చేసేసుకుని బిగ్‌బాస్‌ షోకు రెడీ అవుతాడా? అన్నది చూడాలి! ప్రతి సీజన్‌లో ఓ కమెడియన్‌ ఉన్నట్లే ఈసారి కూడా ఓ హాస్యనటుడిని తీసుకురావాలనుకున్నారు. అందులో భాగంగానే చలాకీ చంటిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. గీతూ రాయల్‌ సోషల్‌ మీడియాలో కొటేషన్లు చెప్తూ బాగా ఫేమస్‌ అయింది. అలాగే బిగ్‌బాస్‌ షోపై రివ్యూలు కూడా ఇచ్చింది. ఆది రెడ్డి కూడా ఈ షోపై రివ్యూలు ఇచ్చిన వ్యక్తే. బిగ్‌బాస్‌ ఓటీటీలో షోపై రివ్యూలు ఇచ్చిన యాంకర్‌ శివను లోనికి పంపించారు. ఈ లెక్కన ఈసారి వీరిద్దరినీ కూడా హౌస్‌లోకి పంపించే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఇక అందరినీ మించి ఉదయభాను షోలో అడుగుపెడ్తే ఎలా ఉంటుందో చూడాలని చాలామంది వెయిట్‌ చేస్తున్నారు. ఐపీఎల్‌ యాంకర్‌ నేహా చౌదరి బిగ్‌బాస్‌కు వస్తుండటం కూడా చాలామంది ఆశ్చర్యపరుస్తోంది. 

No comments:

Post a Comment