బీజేపీ నేతలది తోలు మందం : ఖర్గే

Telugu Lo Computer
0


భారతీయ జనతా పార్టీ నేతలది మందపాటి చర్మమని, అందుకనే ద్రవ్యోల్బణం ప్రభావం వారికి తెలియట్లేదని లోక్‭సభా కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గే ఘాటుగా విమర్శించారు. పెరిగిన ద్రవ్యోల్బణంపై పార్లెమెంట్ వేదికగా ప్రభుత్వాన్ని విపక్షాలు నిలదీశాయి. విపక్షాలు లేవనెత్తిన ఈ అంశంపై బీజేపీ ఎంపీ జయంత్ సిన్హా స్పందిస్తూ ''విపక్షాలు ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం గురించి మాట్లాడుతున్నాయి. కానీ అదెక్కడా కనిపించడం లేదు'' అంటూ వ్యాఖ్యానించారు. దీనికి ఖర్గే బదులిస్తూ ''ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం ప్రభావం దేశంలోని ప్రజలందరూ అనుభవిస్తున్నారు. కానీ ఇవేవీ కనిపించడం లేదని బీజేపీ నేతలు అంటున్నారు. వారి చర్మం మందంగా ఉండడం వల్ల వారికి ఈ ప్రభావం తెలియట్లేదు'' అని అన్నారు. దేశంలో పెరుగుతున్న ధరలపై సోమవారం చర్చ సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందిస్తూ మన దేశానికి మాంద్యం ముప్పు లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అంతర్జాతీయ సంస్థల అంచనా మేరకు మన దేశం చాలా వేగంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు. బ్లూంబెర్గ్‌ సర్వే కూడా భారత్‌ మాంద్యంలోకి వెళ్లేందుకు అవకాశాలు శూన్యమని పేర్కొందని, చాలా దేశాలకంటే మన ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా ఉందన్నారు. 'ఇది వాస్తవాల ఆధారంగా కాకుండా రాజకీయంగా జరుగుతున్న చర్చ. ఈరోజు సుమారు 30 మంది ఎంపీలు మాట్లాడారు. వారంతా రాజకీయ కోణంలోనే మాట్లాడారు' అని నిర్మలా విమర్శించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)