లుంపీ స్కిన్ వ్యాధితో 1500 ఆవులు మృతి

Telugu Lo Computer
0


గుజరాత్‭లో 1,565 ఆవులు లుంపీ స్కిన్ వ్యాధి కారణంగా మృత్యువాత పడినట్లు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలోని 20 జిల్లాల్ల 2,083 గ్రామాల్లో ఈ వ్యాధి వ్యాపించిందని, మొత్తంగా 55,950 పశువులపై ఈ వ్యాధి ప్రభావం ఉందని ప్రభుత్వం పేర్కొంది. అయితే ప్రభుత్వం తెలిపిన వివరాల కంటే అధికంగా పశువులు చనిపోయినట్లు విమర్శలు వస్తున్నాయి. ఇదే విషయమై గుజరాత్ కాంగ్రెస్ విభాగం రైతు సంఘం నేత పాల అంబాలియా స్పందిస్తూ ''ముంద్రా, మండ్వి తాలుకాల్లో పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. ఈ రెండు తాలుకాల్లోనే 20,000 నుంచి 25,000 పశువులు చనిపోయాయి. ఎక్కడ చూసినా ప్రతిరోజు ఆవులు, గేదెల మృతదేహాల కుప్పలే కనిపిస్తాయి'' అని అన్నారు. మే చివరిలో వెలుగు చూసిన ఈ లుంపీ స్కిన్ వ్యాధి.. ద్వారకా, కచ్, జాంనగర్ జిల్లాల్లో విస్తృతంగా వ్యాపిస్తోందట. మొత్తంగా 20 జిల్లాల్లో ఈ ప్రభావం ఉన్నప్పటికీ ఎక్కువ కేసులు ఈ మూడు జిల్లాల్లోనే కనిపిస్తున్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. విపక్షాలు విమర్శకుల నుంచి వస్తున్న విమర్శలపై రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు స్పందిస్తూ ఆయా జిల్లా అధికారుల నుంచి వచ్చిన అధికారిక సమాచారం ఆధారంగానే తాము గణాంకాల్ని విడుదల చేశామని, ఇందులో ఎలాంటి లోటుపాట్లకు అవకాశం లేదని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో ప్రమాదకర స్థాయిలో విస్తరిస్తున్న ఈ వ్యాధిపై కొన్ని స్వచ్ఛంద, గోరక్షణ సంస్థలు అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. కచ్ జిల్లాలో 969 గ్రామాల్లో 14 మంది వెటర్నటీ డాక్టర్లతో గౌ గోపాల్ సమితి సహాయక చర్యలు చేపట్టింది. దీనితో పాటు చర్మ వ్యాధులు సహా ఇతర వ్యాధుల నుంచి పశువులను కాపాడుకునేలా రైతులను ప్రజలను చైతన్యం చేసే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ విషయమై గౌ గోపాలు సమితి సభ్యుడు నరన్ గాధ్వి స్పందిస్తూ ''ఒక్క ప్రాగ్పర్‭లోనే 1,200, బుజ్‮‭పుర్‭లో 800 గోవులు, గేదెలు మృత్యువాత పడ్డాయి. కచ్ జిల్లాలో ఇంతకంటే ఎక్కువే ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా 30,000 ఆవులు మరణించినట్లు అంచనాలు ఉన్నాయి. ప్రభుత్వం స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలి'' అని అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)