విమానాశ్రయంలో విదేశీ కరెన్సీ స్వాధీనం

Telugu Lo Computer
0


ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో పరంజీత్ అనే వ్యక్తి దుబాయ్ ఫ్లైట్ చెక్ చేసేందుకు వెళ్తుండగా, లగేజ్ స్కాన్ చేస్తున్న దగ్గర అతడి కదలికలు పోలీసులకు కాస్త అనుమానం కలిగించాయి. దీంతో సదరు వ్యక్తిని పక్కకు తప్పించి, అతడి లగేజ్‌ని క్షుణ్ణంగా తనిఖీ చేసేందుకు మరో చెక్ పాయింట్ దగ్గరకు  అధికారులు తీసుకెళ్లారు. ఎక్స్‌రే స్కాన్ చేస్తుండగా, అతడి బ్యాగ్‌లోని ఓ సైడ్ అరలో 2,62,500 సౌదీ రియల్  విదేశీ కరెన్సీ ఉన్నట్లు గుర్తించారు. ఇక వాటికి సంబంధించిన సరైన డాక్యుమెంట్స్ చూపించకపోవడంతో.. పరంజీత్‌ను అదుపులోకి తీసుకుని,ఆ విదేశీ కరెన్సీని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)