నిధులు, మినహాయింపులు ఇవ్వండి !

Telugu Lo Computer
0


ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన నీతి అయోగ్ 7వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం ఆదివారం ప్రారంభమైంది. రాష్ట్రపతి భవన్‭లోని కల్చరల్ సెంటర్‭లో కొనసాగుతున్న ఈ సమావేశం జూలై 2019 తర్వాత మొదటి వ్యక్తిగత గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం కావడం గమనార్హం. కాగా, ఈ సమావేశానికి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. తమ రాష్ట్రాలకు కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు కావాలని, రాయితీలు, మినహాయింపులు కావాలంటూ ఈ సమావేశానికి హాజరైన ముఖ్యమంత్రులు ప్రధానంగా కోరారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మాట్లాడుతూ ఒడిశా రాష్ట్రం ప్రతి ఏటా ప్రకృతి విపత్తుల వల్ల చాలా నష్టపోతోందని, ఒడిశాపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి సరిపడా నిధులు విడుదల చేయాలని కోరారు. ఇక ఛత్తీస్‭గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకాన్ని 20 వేల జనాభాకు తక్కువున్న పట్టణాల్లో కూడా అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే జీఎస్టీ పరిహారాన్ని కూడా ఆయన లేవనెత్తారు. నీతి ఆయోగ్ సమావేశ ఎజెండాలో నూనెగింజలు, పప్పుధాన్యాలు, వ్యవసాయ సంఘాలలో స్వయం సమృద్ధి సాధించడం, జాతీయ విద్యా విధానం, పంటల వైవిధ్యం లాంటి వాటితో పాటు ఇతర అంశాలు ఉన్నాయి. ఈ సమావేశంలో రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్‭లు, కొంత మంది కేంద్ర మంత్రులు పాల్గొంటారు. నేటి సమావేశం ద్వారా కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య సహకారానికి నూతన దారులు నిర్మిస్తుందని ఈ సమావేశానికి ముందు ప్రధాని కార్యాలయం పేర్కొంది.

Post a Comment

0Comments

Post a Comment (0)