నేలకొరిగిన భారీ వృక్షం ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday, 7 August 2022

నేలకొరిగిన భారీ వృక్షం !

\

రాజస్తాన్ లోని జైపూర్‌, భంక్రోటా ప్రాంతంలోని శ్రీరామ్ పాల్ బజాలీ ఆలయం ముందు కేవలం మూడు సెకన్ల వ్యవధిలో ముప్పై ఏళ్ల చెట్టు కూలిపోయింది. ఈ చెట్టు పడిపోయిన సమయంలో దాని కింద చాలా మంది కూర్చున్నారు. కానీ, చెట్టు పడే శబ్దాన్ని విని  ప్రజలు అక్కడి నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఈ ఘటన గురువారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో జరిగినట్లు సమాచారం. ఈ సందర్భంగా ఆలయంలోపల సావమణి కార్యక్రమం జరుగుతుంది. కార్యక్రమానికి హాజరయ్యేందుకు 150 మందికి పైగా అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కోశాధికారి గణేష్ యాదవ్ మాట్లాడుతూ ఆలయంలో ఇంత పెద్ద సంఘటన జరిగినా దేవుడి దయతో భక్తులకు ఎలాంటి దెబ్బలు తగలలేదని,  భారీ చెట్టు బలహీనంగా మారిందని, అందుకే ఇలా కూలిపోయిందని తెలిపారు. ఈ తతంగం అంతా అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికారుడై, వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది. 

No comments:

Post a Comment