పారా టేబుల్ టెన్నిస్ లో తొలి స్వర్ణం

Telugu Lo Computer
0


కామన్వెల్త్ గేమ్స్ లో భారత పారా టేబుల్ టెన్నిస్ ప్లేయర్ భవినాబెన్ పటేల్ ఉమెన్స్ సింగిల్స్ విభాగంలో స్వర్ణం సాధించింది. దీంతో ఈ పోటీల్లో ఇప్పటి వరకు భారత్ పతకాల సంఖ్య 40కి చేరింది. వీటిలో 13 స్వర్ణాలు, 11 రజతాలు, 16 కాంస్యాలు ఉన్నాయి. గుజరాత్‌కు చెందిన 35 ఏళ్ల భవినా పటేల్ 12-10 11-2 11-9తో నైజీరియాకు చెందిన క్రిస్టియానా ఇక్‌పెయోయ్‌పై 3-0తో విజయం సాధించింది. దీంతో టెబుల్ టెన్నిస్ విభాగంలో భారత తరఫున స్వర్ణ పతకం సాధించిన మొదటి క్రీడాకారిణిగా భవినాబెన్ పటేల్ రికార్డులకెక్కింది. అంతకముందు మరో పారా టేబుల్ టెన్నిస్ పోటీలో ప్లేయర్‌ సోనాల్‌బెన్‌ మనూబాయి పటేల్‌ కాంస్యం సొంతం చేసుకుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)