కేరళలో ఐదు మంకీపాక్స్ కేసులు నమోదు

Telugu Lo Computer
0


కేరళలో మరో మంకీపాక్స్ కేసు బయటపడింది. మలప్పురానికి చెందిన 30 ఏళ్ల వ్యక్తికి మంకీపాక్స్ సోకినట్లు కేరళ ఆరోగ్యమంత్రి వీణా జార్జ్ వెల్లడించారు. జూలై 27న యూఏఈ నుంచి కోజికోడ్ ఎయిర్ పోర్టుకి వచ్చిన వ్యక్తికి మంకీపాక్స్ నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటివరకు కేరళలో 5 మంకీపాక్స్ కేసులు నమోదైనట్లు రాష్ట్రమంత్రి వీణా జార్జ్ తెలిపారు వ్యక్తులకు ట్రీట్మెంట్ అందిస్తున్నామని.. ఎప్పటికప్పుడు రోగుల ఆరోగ్యపరిస్థితి తెలుసుకుంటున్నామన్నారు. ఇదిలా ఉంటే.. ఢిల్లీ ఎల్ఎన్ జేపీ హాస్పిటల్ నుంచి మంకీపాక్స్ నుంచి కోలుకున్న వ్యక్తి డిశ్చార్జ్ అయ్యాడు. 25 రోజుల్లోనే మంకీపాక్స్ నుంచి వ్యక్తి కోలుకున్నట్లు హాస్పిటల్ ఎండీ సురేశ్ కుమార్ తెలిపారు. ఆఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తికి మంకీపాక్స్ సోకింది. ఢిల్లీలో తొలి మంకీపాక్స్ కేసుగా గుర్తించారు. జ్వరం, దద్దుర్లు ఇతర లక్షణాలతో హాస్పిటల్ లో అడ్మిట్ అయినట్లు వైద్యులు వెల్లడించారు. ఐసోలేషన్ లో ఉంచి వ్యక్తికి ట్రీట్మెంట్ అందించినట్లు తెలిపారు. మరోవైపు ఇంకో మంకీపాక్స్ కేసు ఉందని.. మరో ఇద్దరికి లక్షణాలున్నాయని డాక్టర్ సురేశ్ కుమార్ పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)