యూట్యూబ్ చూసి మూడు లెర్నింగ్ యాప్‌లు తయారుచేశాడు !

Telugu Lo Computer
0


హర్యానా లోని ఝజ్జర్‌లో కార్తికేయ జఖర్ జవహర్ నవోదయ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. ఎవరి దగ్గర శిక్షణ తీసుకోకుండానే మూడు లెర్నింగ్ అప్లికేషన్‌లను రూపొందించాడు. అంతేకాదు అమెరికాలో హార్వర్డ్ యూనివర్శిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్‌ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు. స్కాలర్‌షిప్‌తో చదువుకుంటున్నాడు. కార్తికేయ మాట్లాడుతూ కోడింగ్ ప్రక్రియలో భాగంగా మొబైల్ ఫోన్‌తో తానెదుర్కొన్న ఇబ్బందులను వివరించాడు. సీరియస్‌గా పని చేసుకుంటున్న సమయంలో ఫోన్ హ్యాంగ్ అయ్యేది. దాంతో యూట్యూబ్ చూసి ఫోన్‌ని ఫిక్స్ చేయడం నేర్చుకున్నానని  ఆ విధంగా చదువు కొనసాగించానని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే మూడు యాప్‌లు తయారు చేసినట్లు చెప్పాడు. ఒకటి లూసెంట్ జికె ఆన్‌లైన్ కాగా, రెండోది కోడింగ్, గ్రాఫిక్ డిజైనింగ్ కోసం రామ్ కార్తీక్ లెర్నింగ్ సెంటర్, శ్రీరామ్ కార్తీక్ డిజిటల్ ఎడ్యుకేషన్ అనే మూడు యాప్‌లు రూపొందించినట్లు తెలిపాడు. అతి పిన్న వయస్కుడైన యాప్ డెవలపర్‌గా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్నాడు ప్రస్తుతం 45 వేలమంది విద్యార్థులకు ఉచితంగా శిక్షణ కూడా ఇస్తున్నాడు.

Post a Comment

0Comments

Post a Comment (0)