పేలిన ఎలక్ట్రిక్‌ బైక్‌ !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని కందుకూరు పట్టణానికి చెందిన ఆరీఫ్‌ అనే వ్యక్తి 'ఎకోతేజా' అనే కంపెనీకి చెందిన విద్యుత్‌ బ్యాటరీ ద్విచక్ర వాహనాన్ని కొంతకాలం క్రితం రూ.80 వేలు వెచ్చించి కొనుగోలు చేశాడు. శుక్రవారం కనిగిరి రోడ్డులోని అయ్యప్పస్వామి గుడి సమీపంలో ఓ చోట వద్ద వాహనానికి చార్జింగ్‌ పెట్టాడు. కొద్దిసేపటికే వాహనం బ్యాటరీ పేలి మంటలు వ్యాపించాయి. చుట్టుపక్కల వారు గమనించి వెంటనే నీళ్లు చల్లి మంటలు ఆర్పివేశారు. బ్యాటరీ పేలిన సమయంలో సమీపంలో ఎవరూ లేకపోవడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు.


Post a Comment

0Comments

Post a Comment (0)