రేషన్ కార్డు జారీకి ఉమ్మడి రిజిస్ట్రేషన్ సౌకర్యం ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday, 7 August 2022

రేషన్ కార్డు జారీకి ఉమ్మడి రిజిస్ట్రేషన్ సౌకర్యం !


కేంద్ర ప్రభుత్వం 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో రేషన్ కార్డులను జారీ చేయడానికి ఉమ్మడి రిజిస్ట్రేషన్ సౌకర్యాన్ని ప్రారంభించింది. ఈ రిజిస్ట్రేషన్‌తో నిరాశ్రయులు, నిరుపేదలు, వలసదారులు, ఇతర అర్హులైన లబ్ధిదారులు రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడం సులభమవుతుంది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో అర్హులైన లబ్ధిదారులను గుర్తించడమే ‘కామన్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ’ (నా రేషన్-నా హక్కు) ఉద్దేశ్యం అని ఆహార కార్యదర్శి సుధాన్షు పాండే ఈ సందర్భంగా తెలిపారు. ప్రజలకు రేషన్‌కార్డుల జారీకి ఇది దోహదపడుతుందని అన్నారు. గత 7 నుండి 8 సంవత్సరాలలో వివిధ కారణాల వల్ల సుమారు 18 నుండి 19 కోట్ల మంది లబ్ధిదారులకు చెందిన 4.7 కోట్ల రేషన్ కార్డులు రద్దు చేయబడ్డాయి. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అర్హులైన లబ్ధిదారులకు క్రమ పద్ధతిలో కొత్త కార్డులను కూడా జారీ చేస్తాయి. దేశ వ్యాప్తంగా అమలు చేస్తున్న ఈ సదుపాయం ప్రారంభంలో 11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో పైలట్ ప్రాతిపదికన కొత్త వెబ్ ఆధారిత సౌకర్యం అందుబాటులో ఉంటుందని చెప్పారు. మొత్తం 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఈ నెలాఖరులోగా ప్రారంభం కానున్నాయి. ఈ 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో అసోం, గోవా, లక్షద్వీప్, మహారాష్ట్ర, మేఘాలయ, మణిపూర్, మిజోరాం, నాగాలాండ్, త్రిపుర, పంజాబ్, ఉత్తరాఖండ్ ఉన్నాయి. జాతీయ ఆహార భద్రత చట్టం ద్వారా దాదాపు 81.35 కోట్ల మంది లబ్ధి పొందుతున్నారు. ఈ చట్టం కింద దాదాపు 79.77 కోట్ల మంది ప్రజలు ఆహార ధాన్యాలను పొందుతున్నారు.

No comments:

Post a Comment