దేశంలో కొత్తగా 20,551 కరోనా కేసులు నమోదు !

Telugu Lo Computer
0


దేశంలో తాజాగా 20,551 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, గత 24 గంటల్లో 21,595 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,35,364గా ఉందని చెప్పింది. రోజువారీ పాజిటివిటీ రేటు 5.14 శాతంగా ఉందని పేర్కొంది. వారాంతపు పాజిటివిటీ రేటు 4.64 శాతంగా ఉంది. కరోనా రికవరీ రేటు ప్రస్తుతం 98.50 శాతంగా ఉందని తెలిపిందిఇప్పటివరకు దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య మొత్తం 4,34,45,624గా ఉందని చెప్పింది. దేశంలో ఇప్పటివరకు 87.71 కోట్ల కరోనా పరీక్షలు చేశారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. నిన్న 4,00,110 కరోనా పరీక్షలు చేశారని వివరించింది. దేశంలో ఇప్పటివరకు మొత్తం 205.59 కరోనా వ్యాక్సిన్ డోసులు వేశామని తెలిపింది. వాటిలో రెండో డోసులు 93.46 కోట్లు, బూస్టర్ డోసులు 10.09 కోట్లు ఉన్నాయని పేర్కొంది. నిన్న దేశంలో 36,95,835 డోసుల వ్యాక్సిన్లు వేశారని వివరించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)