రెపో రేటును పెంచిన ఆర్బీఐ

Telugu Lo Computer
0


భారతీయ రిజర్వు బ్యాంకు ద్వైమాసిక ద్రవ్య పరపతి సమీక్ష నిర్ణయాలను ఆ బ్యాంకు గవర్నర్ శక్తికాంత దాస్ ఇవాళ ప్రకటించారు. రెపో రేటును పెంచుతున్నట్లు చెప్పారు. దీంతో ఇళ్ళు, వాహనాలు వంటి రుణాల ఈఎంఐలు పెరగనున్నాయి. రెపో రేటును ఆర్బీఐ 50 బేసిస్‌ పాయింట్లు పెంచడంతో ఇప్పుడు అది 5.40 శాతానికి చేర్చింది. దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ అనంతరం ఆర్బీఐ వరుసగా మూడోసారి రెపోరేటును పెంచడం గమనార్హం. ఆర్బీఐ మే నెలలో 40 బేసిస్‌ పాయింట్లు పెంచిన విషయం తెలిసిందే. ఆ తదుపరి నెల మరో 50 పాయింట్లు పెంచింది. ఈ సారి రెపోరేటు దాదాపు 35 బేసిస్ పాయింట్లు పెరుగుతుందని నిపుణులు అంచనా వేశారు. అయితే, ఆర్బీఐ అంతకు మించి పెంచింది. ఆగస్టు 3 నుంచి ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్వహించారు. జూన్‌లో రీటైల్ ద్రవ్యోల్బణం 7.01 శాతంగా నమోదుకాగా, అంతకు ముందు నెల 7.04 శాతంగా ఉంది. ఈ ప్రభావంతో రెపోరేటును ఇప్పుడు 50 బేసిస్‌ పాయింట్లు  పెంచుతూ ద్రవ్య పరపతి విధాన కమిటీ నిర్ణయం తీసుకుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)