ఇద్దరు పిల్లల చట్టాన్నిసమర్ధించను - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 14 July 2022

ఇద్దరు పిల్లల చట్టాన్నిసమర్ధించను


ఏఐఎమ్ఐఎమ్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ గురువారం ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ దేశంలో జనాభా నియంత్రణ కోసం ఇద్దరు పిల్లల్ని మాత్రమే కనాలి అనే చట్టం తీసుకొస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్ధించబోమన్నారు. ''చైనా చేసిన పొరపాటే మనం తిరిగి చేయొద్దు. జనాభా నియంత్రణ కోసం ఇద్దరు పిల్లల్ని మాత్రమే కనాలి అనే చట్టం తీసుకొస్తే సమర్ధించను. ఇది దేశానికి ఎంతమాత్రం మంచిది కాదు. 2030కల్లా దేశంలో సంతానోత్పత్తి రేటు తగ్గుతుంది. అదే జనాభాను స్థిరంగా ఉంచుతుంది'' అని అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై గతంలో కూడా మాట్లాడారు. ''దేశంలో ముస్లింలే ఎక్కువగా గర్భనిరోధక సాధనాలు వాడుతున్నారు. జనాభా పెరుగుదలకు ముస్లింలను మాత్రమే బాధ్యుల్ని చేయడం సరికాదు. వాళ్లు భారతీయులు కాదా? ద్రవిడియన్లు, గిరిజనులు మాత్రమే అసలైన భారతీయులు. ఉత్తర ప్రదేశ్‌లో ఎలాంటి చట్టాలు లేకుండానే 2026-2030 కల్లా జనాభా నియంత్రణలోకి వస్తుంది'' అని వ్యాఖ్యానించారు. కొంతకాలంగా దేశంలో జనాభా నియంత్రణ కోసం కఠిన చట్టాలు తేవాలనే ప్రచారం జరగుతోంది. రాజస్థాన్, తెలంగాణ, ఉత్తరాఖండ్, గుజరాత్, ఆంధ్ర ప్రదేశ్, అసోం, ఒడిశాలు ఇద్దరు పిల్లలకు మించి ఉన్న వారు స్థానిక ఎన్నికల్లో పోటీ చేయకుండా చట్టం తీసుకొచ్చారు. జనాభా నియంత్రణలో భాగంగానే ఈ చట్టాల్ని రూపొందించారు.

No comments:

Post a Comment