పెట్రోల్‌పై లీటరుకు రూ.5 వ్యాట్ తగ్గింపు

Telugu Lo Computer
0


మహారాష్ట్రలో పెట్రోల్‌పై లీటరుకు రూ.5, డీజిల్‌పై లీటరుకు రూ.3 తగ్గిస్తున్నట్లు ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ప్రకటించారు. మంత్రాలయలో షిండే నేతృత్వంలో కేబినెట్ సమావేశం జరిగింది. ఇందులో పెట్రోల్‌, డీజిల్ వ్యాట్‌పై నిర్ణయం తీసుకున్నట్లు ఏక్‌నాథ్ షిండే తెలిపారు. ఈ నిర్ణయం ద్వారా రాష్ట్ర ఖజానాపై రూ.6,000 కోట్ల భారం పడుతుందని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా డిప్యూటీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ… శివసేన-బీజేపీ ప్రభుత్వం ప్రజా సంక్షేమం విషయంలో ఎంత నిబద్ధతతో ఉందో తాము తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా స్పష్టమవుతుందని అన్నారు. కాగా, పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌తో పాటు మహారాష్ట్రకు సంబంధించిన పలు కీలక నిర్ణయాలను కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే తీసుకున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై మంత్రుల నుంచి ఆయన సూచనలు తీసుకున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)