అధికారిక నివాసాన్ని వీడిన రామ్ నాథ్ కోవింద్

Telugu Lo Computer
0


మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అధికారిక నివాసమైన రాష్ట్రపతి భవన్‌ను ఖాళీ చేశారు. సోమవారం ఉదయం ఆయన రాష్ట్రపతి భవన్ విడిచి కొత్త నివాస స్థలానికి చేరుకున్నారు. ఢిల్లీలోని 12, జన్‌పథ్‌ ఇకపై ఆయన నివాసంగా ఉండనుంది. ఇక్కడే ఆయన కుటుంబంతో కలిసి నివసిస్తారు. ఇక్కడ ఇంతకుముందు దివంగత, కేంద్ర మాజీ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ ఉండేవారు. ఆయన 2020లో మరణించారు. తర్వాత ఆయన కుటుంబం అక్కడే ఉండేది. అయితే, బలవంతంగా వారిని అక్కడ్నుంచి ఈ ఏడాది మార్చిలో ఖాళీ చేయించారు. అప్పట్నుంచి ఖాళీగా ఉంటున్న ఈ నివాసాన్ని ఇప్పుడు రామ్ నాథ్ కోవింద్‌కు కేటాయించారు. ఈ ఇంటికి దగ్గర్లోనే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నివాసం ఉంది. ఆమె 10, జన్‌పథ్‌లో ఉంటున్నారు. రామ్ నాథ్ కోవింద్ రాష్ట్రపతి భవనాన్ని వదిలేముందు ఆయనకు త్రివిధ దళాలు గౌరవ వందనం సమర్పించాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)