నాకు కావాల్సింది డబ్బు కాదు, న్యాయం ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 16 July 2022

నాకు కావాల్సింది డబ్బు కాదు, న్యాయం !


కర్ణాటకలోని కరూర్ పట్టణంలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణ నేపథ్యంలో ముగ్గురు హత్యకు గురికాగా, మరికొందరు గాయాలపాలయ్యారు. వారిలో ఓ బాధిత కుటుంబానికి మాజీ సీఎం, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య రూ.2 లక్షల పరిహారం ఇవ్వగా, ఆయన ఎస్కార్ట్ వాహనంపైకి గాయపడ్డ వ్యక్తి భార్య డబ్బులను విసిరేసింది. తమకు కావల్సింది డబ్బు కాదని, న్యాయం కావాలని డిమాండ్ చేసింది. బాగల్ కోటేలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించిన ఆ ప్రాంత ఎమ్మెల్యే సిద్ధరామయ్య .. ఒక్కో గాయపడ్డ వ్యక్తి కుటుంబానికి తన సొంత డబ్బు రూ.50వేలను అందించారు. ఆ క్రమంలోనే ఓ వ్యక్తి సహా నలుగురు కుటుంబీకులను పరామర్శించిన అనంతరం వారికి రూ.2 లక్షలనందించి వెళుతున్న సిద్ధరామయ్యకు ఊహించని పరిణామం ఎదురైంది. ఆయన కారు ఎక్కి వెళ్లిపోతున్న క్రమంలో ఆ కుటుంబానికి చెందిన ఓ మహిళ రూ.2 లక్షల నోట్ల కట్టను సిద్ధరామయ్య వాహనంపైకి విసిరేసింది. తాము తప్పు చేయకపోయినా, కారణం లేకుండా తమ వారిపై దాడికి దిగారన్న ఆ మహిళ.. తమ కుటుంబీకులు కోలుకోవాలంటే కనీసం ఏడాదైనా పడుతుందని.. తమ సమస్యకు డబ్బు పరిష్కారం కాదని తెలిపింది. బిక్షాటన చేసైనా తాము బతుకుతామని.. తమకు కావల్సింది డబ్బు కాదని, న్యాయమని డిమాండ్ చేసింది.

No comments:

Post a Comment