బీహార్‌లో ప్రభుత్వ ఉద్యోగుల రెండో పెళ్లికి పర్మిషన్ తప్పనిసరి ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 16 July 2022

బీహార్‌లో ప్రభుత్వ ఉద్యోగుల రెండో పెళ్లికి పర్మిషన్ తప్పనిసరి !


బీహార్ లో ఇకపై ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా రెండో పెళ్లి చేసుకోవాలి అనుకుంటే ముందుగా ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. తాజా చట్టం ప్రకారం అధికారులు తమ శాఖలకు విషయాన్ని తెలియజేసి, అక్కడ్నుంచి అనుమతి వచ్చిన తర్వాతే రెండో పెళ్లి చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు తమ పెళ్లికి సంబంధించిన వివరాల్ని ప్రభుత్వానికి సమర్పించాలి. ఒకవేళ రెండో పెళ్లి చేసుకుంటే, ముందుగానే వారు పనిచేసే శాఖకు తెలియజేసి, అనుమతి తీసుకోవాలి. ఆ తర్వాతే పెళ్లి చేసుకోవాలి. అలాగే మొదటి జీవిత భాగస్వామితో చట్టపరంగా విడిపోయి ఉండాలి. విడాకులు తీసుకోకున్నా లేదా మొదటి జీవిత భాగస్వామికి అభ్యంతరం ఉన్నా రెండో పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. ఇది మహిళా ఉద్యోగి, పురుష ఉద్యోగి… ఇద్దరికీ వర్తిస్తుంది. విడాకులు తీసుకోకుండా రెండో పెళ్లి చేసుకున్నా, ప్రభుత్వ అనుమతి లేకుండా ఉన్నా, అలాగే మొదటి జీవిత భాగస్వామి అభ్యంతరం వ్యక్తం చేసినా ఉద్యోగి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సదుపాయాలు అందవు. అంటే ఉద్యోగి చనిపోతే వారి జీవిత భాగస్వామికి పెన్షన్, పిల్లలకు కారుణ్య నియామకం కింద ఉద్యోగం, ఇతర ఆర్థిక సదుపాయాలు వంటివి లభించవు. ఇవన్నీ పొందాలంటే ప్రభుత్వం తాజాగా రూపొందించిన నియమాల్ని కచ్చితంగా పాటించాలి. ఈ రూల్స్ పాటించని సందర్భంలో మొదటి భార్య/భర్త, వారి పిల్లలకు మాత్రమే ఈ సదుపాయాలు అందుతాయి. ఈ చట్టాన్ని అమలు చేయాల్సిందిగా డివిజనల్ కమిషనర్స్, జిల్లా మెజిస్ట్రేట్స్, సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్స్, డీజీపీతోపాటు, ఇతర ఉన్నతాధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.


No comments:

Post a Comment