నిద్రిస్తున్న గొర్రెల కాపరిపై చిరుత దాడి

Telugu Lo Computer
0


కర్ణాటకలోని విజయనగర జిల్లా హరపనహళ్లి తాలూకా కండికేరి ఫారెస్ట్ ఏరియాలో నివాసం ఉండే 21 ఏళ్ళ కూగార్‌ కరిబసప్ప మంగళవారం ఉదయం గొర్రెలను మేపటానికి సమీపంలోని అటవీ ప్రాంతానికి వెళ్లాడు. ఈ క్రమంలో కాస్త అలసట అనిపించి.. ఓ కునుకు వేసేందుకు చిక్కటి నీడ ఉన్న ఓ చెట్టుకింద నిద్రపోయాడు. ఈ క్రమంలో ఎంతసేపు నుంచి మాటు వేసి ఉందో తెలియదు కానీ, చిరుత ఒక్కసారిగా దూసుకువచ్చి అతనిపై దాడి చేసింది. దీంతో వెంటనే అలర్టైన కరిబసప్ప తన పక్కనే గొడ్డలితో చిరుతపై ప్రతి దాడికి దిగాడు. దీంతో చిరుత కంగుతింది. తోకముడిచి అక్కడి నుంచి జారుకుంది. ఈ క్రమంలో అడవిలోకి జారుకుంటున్న చిరుతను కరిబసప్ప తన సెల్‌ఫోన్‌లో ఫొటో తీశాడు. చిరుత దాడితో అతని నుదుటిపై గాయమైంది. ఇంటికి వెళ్లి జరిగిన విషయం గ్రామస్థులకు చెప్పాడు. విషయం తెలుసుకున్న ఫారెస్ట్ ఆఫీసర్స్ ఘటనా స్థలికి వెళ్లి పరిశీలించారు. చిరుతను బంధించటానికి బోన్లు ఏర్పాట్లు చేస్తామని.. దాని జాడ తెలుసుకునేందుకు కెమెరాలు పెడతామని అటవీశాఖ అధికారులు వెల్లడించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)