సమయం మించిన తర్వాత తినకూడని ఆహార పదార్థాలు ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday, 17 July 2022

సమయం మించిన తర్వాత తినకూడని ఆహార పదార్థాలు !


రాత్రి భోజనం ఎనిమిది గంటల్లోపే తినమని ఆరోగ్యనిపుణులు చెబుతారు. కానీ చాలా మంది రాత్రి తొమ్మిది దాటాకే తింటుంటారు. రాత్రి ఆలస్యంగా భోజనం చేయడం వల్లే చాలా మంది బరువు పెరుగుతున్నట్టు అధ్యయనాలు కూడా చెబుతున్నాయి. పోషకాహార నిపుణుడు పాలక్ మిధా చెప్పిన ప్రకారం 'నిద్ర పోవడానికి రెండు మూడు గంటల ముందే డిన్నర్ పూర్తి చేయాలి. ఒక వేళ నిద్రపోవడానికి ఒక గంట ముందే అయితే తేలికపాటి భోజనం చేయాలి' అని సూచిస్తున్నారు. భారీ భోజనం తిని వెంటనే నిద్రపోతే సులువుగా బరువు పెరిగిపోతారు. నిజానికి తేలికపాటి ఆహారం తిని పడుకుంటే నిద్రలోనే మనం బరువు తగ్గుతాం. హెల్త్ లైనో ప్రచురించిన పరిశోధన ప్రకారం ఎవరైతే లేటుగా రాత్రి భోజనం చేస్తారో వారు అవసరం అయిన దానికంటే అధికంగా తింటారు. అదే ఎనిమిదిలోపే తినేవారు సాధారణం కన్నా కాస్త తక్కువగానే తింటారు. రాత్రి లేటుగా ఆహారం తినాల్సి వస్తే కేలరీలు తక్కువగా ఉండే ఫుడ్ ను ఎంచుకోవాలి. అలాగే జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ జోలికి వెళ్లకూడదు. అలాగే తిన్నాక కాసేపు నడవాలి.  రాత్రి ఎనిమిది గంటల తరువాత  కొన్ని ఆహార పదార్ధాలు తీసుకోకూడదు. చాకోలెట్లు తినకూడదు. ఇవి అధికంగా కేలరీలను జోడిస్తాయి. అంతేకాదు, మెగ్నిషియం, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా నిండి ఉంటాయి కాబట్టి, ఇది మిమ్మల్ని మేల్కొనే ఉండేలా చేస్తుంది. బరువు పెంచడానికి, నిద్రకు భంగం కలిగించడానికి ఆల్కహాల్ ముందుంటుంది. అందుకే రాత్రి పూట మద్యం తాగకూడదు. బరువు తగ్గాలనుకునేవారు ఆల్కహాల్ కు దూరంగా ఉండాలి. చిప్స్ ను డీప్ ఫ్రై చేస్తారు. అవి కేలరీలతో నిండి ఉంటాయి. చాలా మంది టీవీ చూస్తూ చిప్స్ ను లాగించేస్తారు. ఆహారం తిన్నాక కూడా కొంతమంది రాత్రి టీవీ చూస్తూ చిప్స్ తింటారు. ఆ అలవాటును వదిలేయండి. బిర్యానీ తింటూ కూల్ డ్రింకులు లేట్ నైట్ లాగిస్తున్నారా? అయితే బరువు పెరిగిపోతారు, అలాగే అనారోగ్యాలూ తప్పవు. వీటిలో చక్కెర, కేలరీలు అధికంగా ఉంటాయి. కూల్ డ్రింకులు తాగడం వల్ల చాలా సమస్యలు వస్తాయి. అర్థరాత్రి ఐస్ క్రీములు తిన్నవాడే రొమాంటిక్ ఫెలో అని చెప్పుకునే వారు ఎంతో మంది. అలా చెప్పుకునే వారు రాబోయే జబ్బులను కూడా తెలుసుకుని తింటే మంచిది. ఐస్ క్రీమ్ రాత్రి పూట తినడం వల్ల బరువు పెరుగుతారు. కాబట్టి తినడం మానేయండి.

No comments:

Post a Comment