బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు అద్వానీ దూరం

Telugu Lo Computer
0


బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఈ రోజు నుంచి రెండు రోజుల పాటు ఈ హైదరాబాద్ లో జరగనున్నాయి. ఈ మధ్నాహ్నం ప్రధాని మోదీ సమావేశాలకు హాజరు కానున్నారు. పార్టీ కీలక సమావేశాలకు ఎవరు హాజరవుతారనే అంశం పైన పార్టీ నాయకత్వం క్లారిటీ ఇచ్చింది. పార్టీ కార్యవర్గ సమావేశాల ప్రధాన వేదిక పైన ప్రధానితో సహా మరో ఇద్దరు నేతలకు అవకాశం దక్కనుంది. అదే విధంగా పార్టీ సమావేశాలతో పాటుగా టీఆర్ఎస్ లక్ష్యంగా రేపు సాయంత్రం జరిగే బహిరంగ సభను పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఆ సభా వేదిక పైన ప్రధానితో సహా కూర్చునే నేతల జాబితా పైన తుది కసరత్తు జరుగుతోంది. ఇక, ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ ఆహ్వానం పలకటం లేదు. మంత్రి తలసాని స్వాగతం పలుకుతారు. ఈ సమావేశాలకు తెలంగాణకు చెందిన 14 మంది, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఏడుగురి నేతలు హాజరు కానున్నారు. ముఖ్య నేతలు 345 మందికి అవకాశం దక్కనుంది. అయితే, ప్రధానితో పాటుగా ముగ్గురు నాయకులు మాత్రమే ఆసీనులు కానునున్నారు. పార్టీ చీఫ్ నడ్డా తో పాటుగా రాజ్యసభలో పార్టీ నేత పీయూష్ గోయల్ కు అవకాశం కల్పించారు. మహారాష్ట్రలో చోటు చేసుకుంటున్న పరిణామాలతో ఆ రాష్ట్రం నుంచి కొందరు నేతలు సమావేశాలకు గైర్హాజరు అయ్యే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల నుంచి 15 మంది ఆహ్వానితుల జాబితాలో ఉన్న నేతలు సైతం రావటంలేదని సమాచారం. అగ్రనేతలు ఎల్‌కే అడ్వాణీ, మురళీమనోహర్‌ జోషిలు సైతం ఈ సమావేశాలకు రావటం లేదు. వయోభారం కారణంగానే వారు సమావేశాలకు దూరంగా ఉంటున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. జాతీయ కార్యవర్గ సమావేశాలకు తెలంగాణ నుంచి 14 మంది.. ఏపీ నుంచి ఏడుగురు హాజరు కానున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. బీజేపీ రెండు తెలుగు రాష్ట్రాల అధ్యక్షులు బండి సంజయ్, సోము వీర్రాజు తో పాటుగా ఈటల రాజేందర్‌, జి.వివేక్‌ వెంకటస్వామి, జితేందర్‌రెడ్డి, గరికపాటి మోహన్‌రావు, విజయశాంతి, శాసనసభాపక్ష నేత రాజాసింగ్‌, మురళీధర్‌రావు, పొంగులేటి సుధాకర్‌రెడ్డి పాల్గొంటారు. ఆంధ్రప్రదేశ్ నుంచి పురందేశ్వరి, సత్యకుమార్‌, కన్నా లక్ష్మీనారాయణ, పీవీఎన్‌ మాధవ్‌ హాజరు కానున్నారు. కార్యవర్గ సమావేశాల ఆహ్వానితుల జాబితాలో హేమామాలిని, ఖుష్బూ..వసుంధరరాజే సింధియా, డీకే అరుణ సహా 12 మంది జాతీయ ఉపాధ్యక్షులు..అరుణ్‌సింగ్‌, తరుణ్‌ఛుగ్‌ సహా ఎనిమిది మంది జాతీయ ప్రధాన కార్యదర్శులు.. శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, యోగి ఆదిత్యనాథ్‌ సహా 12 మంది ముఖ్యమంత్రులు..మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌, రాష్ట్రాల పార్టీ అధ్యక్షులు ఉన్నారు. ఇక, రేపటి ప్రధాని బహిరంగ సభలో దాదాపు 25 మంది వరకు అవకాశం దక్కనుంది. పార్టీ ముఖ్య నేతలతో పాటుగా తెలంగాణకు చెందిన నేతలకు అవకాశం దక్కనుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)