షింజో అబేకు పార్లమెంట్ సంతాపం

Telugu Lo Computer
0


సోమవారం నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు ఉభయ సభలు మొదలయ్యాయి. ఇటీవల జరిగిన రాజ్యసభ, లోక్‌సభ ఉప ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు ఇవాళ ఆయా సభల్లో సభ్యులుగా ప్రమాణస్వీకారం చేశారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాగానే, ఇటీవల హత్యకు గురైన జపాన్ మాజీ ప్రధాని షింజో అబేకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా నివాళులర్పించారు. రాజ్యసభలోనూ అబే మృతి పట్ల సంతాపం తెలియజేశారు. ఆ తర్వాత రాష్ట్రపతి ఎన్నిక దృష్ట్యా లోక్‌సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. విపక్షాల ఆందోళనల నడుమ పెద్దల సభను రాజ్యసభ ఛైర్మన్ రేపటికి వాయిదా వేశారు. “జపాన్ మాజీ ప్రధాన మంత్రి షింజో అబే ఇటీవల మరణించారని నేను హృదయపూర్వక విచారంతో తెలియజేస్తున్నాను. సభ దాని పట్ల హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తుంది. జూలై 8, 2022న ఆయన కన్నుమూశారు. షింజో అబే జపాన్ ప్రధానిగా అత్యధిక కాలం పనిచేశారు. భారతదేశానికి ప్రయోజనకరమైన వివిధ ప్రయోజనాలకు అబే మద్దతు ఇచ్చాడు. అతను ఆసియాలోని రెండు ప్రముఖ ప్రజాస్వామ్య దేశాలైన భారతదేశం, జపాన్‌లను ‘స్నేహితులు’గా భావించాడు. ఈ కారణంగా, అతని పాలనలో భారతదేశం, జపాన్ మధ్య సంబంధాలు మరింత బలపడ్డాయి.” అని లోక్‌సభ స్పీకర్ బిర్లా అన్నారు. జపాన్ ఒక దార్శనిక నాయకుడిని కోల్పోయిందని లోక్‌సభలో స్పీకర్ ఓం బిర్లా అబే గొప్పతనాన్ని తెలిపారు. మరోవైపు, భారతదేశం నిజమైన స్నేహితుడిని కోల్పోయిందన్నారు. . అబే మరణంపై సభ హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తుందని.. ఆయన ఆత్మకు దేవుడు శాంతిని కలుగజేయాలని ఆకాంక్షించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)