జపాన్ లో కొత్త కోవిడ్ ఇన్‌ఫెక్షన్ల ఉదృతి

Telugu Lo Computer
0


జపాన్ లో  కొత్త కోవిడ్ ఇన్‌ఫెక్షన్లు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయని ఆరోగ్య శాఖ గురువారం హెచ్చరించింది. జపాన్ రాజధానిలో గురువారం 16వేల 662 కొత్త కేసులు నమోదయ్యాయి. మాజీ ప్రధాని షింజో అబే హత్యకు గురై, ఆదివారం జరిగిన ఎన్నికల్లో అధికార సంకీర్ణం గెలిచిన తర్వాత తన మొదటి మీడియా సమావేశంలో ప్రధాని ఫుమియో కిషిడా అత్యున్నత స్థాయి జాగ్రత్త అవసరమని సూచించారు. “కరోనావైరస్ దేశం అంతటా అన్ని వయసుల వారికి వ్యాపిస్తోంది. వేసవి సెలవులు వస్తున్నందున, అన్ని జనరేషన్ల మధ్య పరస్పర కాంటాక్ట్ పెరుగుతుంది” అని తెలిపారు. బూస్టర్ షాట్‌లను తీసుకోవాలని ప్రజలను కోరారు. మరికొద్ది వారాల్లో కేసులు భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. BA.5 వేరియంట్ కొత్త కేసులలో సగానికి పైగా ఉన్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)