టెన్త్ పాసైన ఒడిశా ఎమ్మెల్యే

Telugu Lo Computer
0


ఒడిశాకు చెందిన 58 ఏళ్ల బీజేడీ ఎమ్మెల్యే అంగద కన్హర్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వెల్లడించిన పదో తరగతి ఫలితాల్లో 72 శాతం మార్కులు సాధించారు. మొత్తం 500 మార్కులకు గాను ఆయనకు 364 మార్కులు వచ్చాయి. తన విజయంపై కన్హర్ సంతోషం వ్యక్తం చేస్తూ.. ''నేను 10వ తరగతి పరీక్షలో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించినందుకు సంతోషంగా ఉంది. చదువుకోవడానికి, కొత్త విషయాలు నేర్చుకోవడానికి వయసుతో సంబంధం లేదు. భవిష్యత్తులో ఉద్యోగాలు కోసమే కాకుండా జ్ఞానాన్ని పొందేందుకు చదువు అవసరం " అని ఆయన తెలిపారు. వృత్తిరీత్యా రైతు అయిన కన్హర్, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఫుల్బానీ నియోజకవర్గం నుంచి అధికార బీజేడీ తరుపున తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. పరీక్షల ఫలితాల తరువాత తన గ్రామానికి వెళ్లి అక్కడ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కన్హర్ తో పాటుగా అతని స్నేహితులు మరో ఇద్దరు పరీక్షలు రాయగా ఇందులో ఒకరు స్థానిక సర్పంచ్‌ కావడం గమనార్హం. కాగా బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వెల్లడించిన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో 90.55 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. బాలురు 88.77 శాతం ఉత్తీర్ణత సాధించగా, బాలికలు 92.37 శాతం ఉత్తీర్ణణలు ఆయ్యారు.

Post a Comment

0Comments

Post a Comment (0)