కొత్త జిల్లాలకు లీడ్ బ్యాంకులను ప్రకటించిన ఆర్బీఐ

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే ఉన్న 13 జిల్లాలకు అదనంగా ప్రభుత్వం మరో 13 కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు వాటికి లీడ్ బ్యాంకులను ఆర్బీఐ ప్రకటించింది. పాత 13 జిల్లాలకు అప్పటికే ఉన్న బ్యాంకలను యథాతధంగా ఉంచిన ఆర్బీఐ.. కొత్త జిల్లాలకు మాత్రమే లీడ్ బ్యాంకులను ప్రకటించింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్బీఐ ప్రకారం జిల్లాలకు లీడ్ బ్యాంకులు ఇలా ఉండనున్నాయి. అవి ఏలూరు, కాకినాడ, కోనసీమ, నంద్యాల, బాపట్ల, అల్లూరి, అనకాపల్లి, ఎన్టీఆర్, పల్నాడు, తిరుపతి జిల్లాలకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లీడ్ బ్యాంకుగా వ్యవహరించనుంది. అన్నమయ్య, పార్వతీపురం, మన్యం జిల్లాలకు ఎస్బీఐ, సత్యసాయి జిల్లాకు కెనరా బ్యాంకులను ఆర్బీఐ ప్రకటించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)