అజ్మీర్ షరీఫ్‌ దర్గా ఖదీం వ్యక్తి అరెస్ట్ - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 6 July 2022

అజ్మీర్ షరీఫ్‌ దర్గా ఖదీం వ్యక్తి అరెస్ట్


అజ్మీర్ షరీఫ్‌ దర్గా ఖదీం అయినటువంటి సల్మాన్ చిష్టీని రాజస్థాన్ పోలీసులు అరెస్టు చేశారు. బీజేపీ లీడర్ నుపుర్ శర్మకు వ్యతిరేకంగా కామెంట్లు చేశారు. మంగళవారం సల్మాన్ చేసిన కామెంట్లకు గానూ అతనిని అరెస్టు చేసిన ఏఎస్పీ వికాస్ సంగ్వాన్ తెలిపారు. నుపుర్ శర్మ తల నరికి తీసుకొచ్చిన వారికి తన ఇల్లు, ఆస్తిని బహుమతిగా ఇస్తానంటూ ప్రకటించాడు. మొహమ్మద్ ప్రవక్తపై చేసిన కాంట్రవర్షియల్ కామెంట్లకు గానూ ఒక వీడియోలో ఈ ప్రకటన చేశాడు. “ఖ్వాజా సాహెబ్, మొహమద్ సాహెబ్ లను కించపరిచేలా బీజేపీ నాయకులు కామెంట్ చేశారని, వారి తల తెచ్చిన వారికి ఇల్లు, తన ఆస్తి మొత్తాన్ని ఇచ్చేస్తానని ప్రకటించాడు. దేశవ్యాప్తంగా ముస్లింలను హింసిస్తున్నారని, చంపుతున్నారని” ఆయన తన వీడియోలో ఆరోపించారు. వీడియో వాట్సప్ లో వైరల్ అయిన తర్వాత పోలీసుల దృష్టికి వెళ్లింది. సీరియస్ గా తీసుకుని సల్మాన్ ప్రమాదకరంగా ఉన్నాడని, దర్గా, అంజుమన్ అధికారులతో మాట్లాడి అదుపులోకి తీసుకున్నారు. వీడియో వైరల్‌ కాకముందే ఆపాలని అతనికి సూచించినట్లు తెలుస్తోంది.

No comments:

Post a Comment