ఏఐడీఎంకేకు ఏక నాయకత్వం కావాలి !

Telugu Lo Computer
0


తమిళనాడులో ఎంజీఆర్, జయలలిత ఏఐడీఎంకే పార్టీని ఎలాగైతే ముందుకు తీసుకెళ్ళారో తాను కూడా అదే విధంగా పార్టీని ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నానని ఆ పార్టీ మాజీ నాయకురాలు వీకే శశికళ అన్నారు. ఈ విషయం ఆ పార్టీ శ్రేణులకు తెలుసని చెప్పారు. చెప్పిందే చేసేవారు తమిళనాడుకు కావాలని చెప్పారు. అలాగే, గతంలో ఒకలా ఇప్పుడు మరోలా మాట్లాడేవారు కాకుండా ఎప్పుడూ ఒకేలా మాట్లాడేవారు తమిళనాడుకు కావాలని ఆమె అన్నారు. తాను ఇప్పటికీ పార్టీ ప్రధాన కార్యదర్శినేనని, సరైన సమయం వచ్చినప్పుడు పార్టీ ప్రధాన కార్యాలయానికి వెళ్తానని చెప్పుకొచ్చారు. ఏఐడీఎంకేకు ఏక నాయకత్వం కావాలని ఆ పార్టీ నేతల నుంచి డిమాండ్ వస్తున్న అంశంపై శశికళ స్పందిస్తూ.. ఈ విషయాన్ని పార్టీ శ్రేణుల ఇష్టానికి వదిలేస్తున్నానని చెప్పారు. కాగా, అన్నాడీఎంకేలో ఏక నాయకత్వం కావాలన్న డిమాండ్ వస్తున్న నేపథ్యంలో పార్టీని చేజిక్కించుకునేందుకు సీనియర్ నేతలు పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గాలు పోటీ పడుతున్నాయి. ఇటీవల పార్టీ సర్వసభ్య సమావేశం జరగగా అందులో ఘర్షణపూరిత వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. సర్వసభ్య సమావేశానికి ముందు పార్టీ కార్యాలయం బయట అన్నాడీఎంకు సంబంధించిన బ్యానర్లను చింపివేయగా, ఆ పని శశికళ వర్గానికి చెందిన వారు చేసిన పనిగా అనుమానాలు వ్యక్తమయ్యాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)