ఛార్‌దామ్‌కు తగ్గిన భక్తుల రద్దీ !

Telugu Lo Computer
0


వర్షాలు, వరదల కారణంగా ఛార్‌దామ్‌ యాత్రకు వచ్చే భక్తుల సంఖ్య తగ్గుతున్నది. ప్రస్తుతం రోజుకు వెయ్యి చొప్పున యాత్రలో పాల్గొంటున్నారు. బద్రీనాథ్‌, కేదార్‌నాథ్‌ ఆలయ కమిటీ డేటా ప్రకారం.. యాత్ర మొదలైనప్పటి నుంచి ఈ నెల 16వ తేదీ వరకు 26.49లక్షల మంది ఛార్‌దామ్‌లను సందర్శించారు. ఈ సందర్భంగా బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ మీడియా ఇన్‌చార్జి డాక్టర్ హరీశ్‌ గౌర్ మాట్లాడారు. చార్‌ధామ్‌ యాత్ర ప్రారంభంలో ఒకే రోజు 20వేల మందికిపైగా యాత్రికులు బద్రీనాథ్, కేదార్‌నాథ్‌ను దర్శించుకున్నట్లు చెప్పారు. వర్షాల కారణంగా బద్రీనాథ్, కేదార్‌నాథ్, గంగోత్రి, యమునోత్రి ధామ్‌లను సందర్శించే యాత్రికుల సంఖ్య గణనీయంగా తగ్గింది. వర్షంతో కొండచరియలు విరిగిపడడంతో రహదారులపై బండరాళ్లు, మట్టి పేరుకుపోతున్నది. ఇప్పటి వరకు బద్రీనాథ్‌ను 9,70,610, కేదార్‌నాథ్‌ను 8,81,265, గంగోత్రి 4,50,915 మంది, యమునోత్రి ధామ్‌ను 3,46,132 మంది దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు.


Post a Comment

0Comments

Post a Comment (0)