'స్ర్పైట్' రంగు మారింది !

Telugu Lo Computer
0


ఇప్పటివరకు స్ర్పైట్ బాటిల్ గ్రీన్ కలర్‌లోనే ఉంటూ వచ్చింది. 60 ఏళ్ల తర్వాత తొలిసారిగా స్ర్పైట్ తన బాటిల్ కలర్ మార్చింది. ఈ మేరకు పర్యావరణ అనుకూలమైన తెల్లని రంగు బాటిల్‌తో ఆకుపచ్చ రంగును భర్తీ చేస్తోంది. స్ప్రైట్ మాతృ సంస్థ కోకో కోలా కంపెనీ కొత్త బాటిల్ డిజైన్‌ను ఆగస్ట్ 1 నుంచి విడుదల చేయనుంది. ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధి మాట్లాడుతూ.. చాన్నాళ్ల తర్వాత బాటిల్ ప్యాకేజింగ్‌ను మార్చాలని నిర్ణయించామని.. రీ సైక్లింగ్‌కు వీలుగా ఉండేలా రంగుల్లేని ప్లాస్టిక్ ఉపయోగించాలని నిర్ణయించడమే తాము బాటిల్ రంగును మార్చడానికి కారణమని వివరించారు. ప్రస్తుతానికి అమెరికాలో స్ర్పైట్ కలర్ ను మార్చినట్టు ప్రకటించిన కొకకోలా సంస్థ.. తర్వాత దశలవారీగా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో అమలు చేస్తామని తెలిపింది.  స్పైట్ ఆకుపచ్చ బాటిల్ పాలిథిలిన్ టెరెఫ్తాలేట్ తో తయారు చేయబడింది. ఇది ప్రధానంగా తివాచీలు, దుస్తులు వంటి సింగిల్ యూజ్ ఐటమ్‌గా గుర్తించబడింది. ఈ బాటిళ్లను రీసైక్లింగ్ చేయడం కష్టం. అందుకే కొత్త సీసాల కోసం ఆకుపచ్చ రంగు కంటే స్పష్టమైన ప్లాస్టిక్‌ను తిరిగి ఉపయోగించడం సులభమని కోకో కోలా కంపెనీ అభిప్రాయపడుతోంది. 1961లో అమెరికాలో స్ర్పైట్‌ను మొదటిసారిగా ప్రారంభించబడినప్పటి నుండి ఇది ఆకుపచ్చ రంగులో ప్యాక్ చేయబడిన సీసాలలో మాత్రమే విక్రయించారు. కోకోకోలా కంపెనీ బెస్ట్ సెల్లింగ్ డ్రింక్స్‌లో స్ర్పైట్‌ ఒకటి. ఇన్నేళ్లలో బాటిళ్ల ఆకారం మారినా.. స్ర్పైట్ ఉండే ఆకుపచ్చ రంగు మాత్రం మారలేదు. కానీ ఇప్పుడు ఆ ఆకుపచ్చ రంగుకు స్ర్పైట్ గుడ్ బై చెప్పేస్తోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)